Share News

Rishabh Pant-Sanjeev Goenka: మళ్లీ విఫలమైన పంత్.. లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా రియాక్షన్ చూడండి

ABN , Publish Date - Apr 05 , 2025 | 05:10 PM

లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా రూ. 27 కోట్లకు పంత్‌ను దక్కించుకుని కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతడికే అప్పగించారు. అయితే ఈ ఐపీఎల్‌లో పంత్ ప్రదర్శన నిరాశాపూరితంగా ఉంది. మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ స్వల్ప స్కోర్లకే పరిమితమైన పంత్ తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు.

Rishabh Pant-Sanjeev Goenka: మళ్లీ విఫలమైన పంత్.. లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా రియాక్షన్ చూడండి
Sanjeev Goenka, Rishabh Pant

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక భారీ ధర పలికిన ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant). లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా (Sanjeev Goenka) రూ. 27 కోట్లకు పంత్‌ను దక్కించుకుని కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతడికే అప్పగించారు. అయితే ఈ ఐపీఎల్‌ (IPL 2025)లో పంత్ ప్రదర్శన నిరాశాపూరితంగా ఉంది. మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ స్వల్ప స్కోర్లకే పరిమితమైన పంత్ తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (LSG vs MI) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. పరుగులు చేయాలనే ఒత్తిడి పంత్‌పై చాలా ఎక్కువగా ఉంది.


ఓపెనర్లు ఇచ్చిన అద్భుతమైన ఆరంభం తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్ రెండు పరుగులే చేసి హార్దిక్ వేసిన పదో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు. పంత్ అవుట్ అవగానే స్టేడియంలో ఉన్న లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా చాలా నిరాశగా ఫేస్ పెట్టారు. ఆయన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పంత్‌కు మళ్లీ క్లాస్ తప్పదంటూ సోషల్ మీడియా జనాలు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ టీమ్ గెలవడం పంత్‌కు కాస్త ఊరట కలిగించే అంశం.


ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓపెనర్లు మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ అర్ధశతకాలు సాధించారు. మిడిలార్డర్ విఫలమైనా చివర్లో డేవిడ్ మిల్లర్ బౌండరీలతో విరుచుకుపడడంతో లఖ్‌నవూ 203 పరుగులు చేయగలిగింది. అయితే ఛేజింగ్‌కు దిగిన ముంబై సూర్యకుమార్ (67), నమన్ ధీర్ (46) రాణించినప్పటికీ మిగిలన వారు విఫలం కావడంతో ఈ భారీ ఛేదనలో వెనుకబడింది. ఫలితంగా 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇవి కూడా చదవండి..

IPL 2025: తీరు మార్చుకోని దిగ్వేష్.. బీసీసీఐ భారీ జరిమానా.. పంత్‌కు కూడా ఫైన్


IPL 2025: బ్రిటిష్ అమ్మాయితో యువ క్రికెటర్ సంసారం.. ఆ ఫోటో అర్థం అదేనా


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2025 | 05:10 PM