Yuzvendra Chahal: మీకు మీరే షుగర్ డాడీగా ఉండండి.. టీ-షర్టుతో మాజీ భార్యకు ఛాహల్ కౌంటర్..

ABN, Publish Date - Mar 20 , 2025 | 09:05 PM

ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ముందు ఛాహల్, ధనశ్రీ గురువారం మధ్యాహ్నం హాజరయ్యారు. విడాకుల నేపథ్యంలో ధనశ్రీకి రూ.4.75 కోట్లను భరణంగా చెల్లించడానికి ఛాహల్ అంగీకరించినట్టు సమాచారం. అందులో ఇప్పటికే 2.37 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టుకు ఛాహల్ వేసుకొచ్చిన బ్లాక్ టీ-షర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Yuzvendra Chahal: మీకు మీరే షుగర్ డాడీగా ఉండండి.. టీ-షర్టుతో మాజీ భార్యకు ఛాహల్ కౌంటర్..
Yuzvendra Chahal T-shirt

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరు చేస్తూ ముంబై ఫ్యామిలీ కోర్టు (Mumbai family Court) గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ముందు ఛాహల్, ధనశ్రీ గురువారం మధ్యాహ్నం హాజరయ్యారు (Chahal-Dhanashree Divorce). ధనశ్రీకి రూ.4.75 కోట్లను భరణంగా చెల్లించడానికి ఛాహల్ అంగీకరించినట్టు సమాచారం. అందులో ఇప్పటికే 2.37 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టుకు ఛాహల్ వేసుకొచ్చిన బ్లాక్ టీ-షర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ టీ-షర్ట్ మీద మీకు మీరే షుగర్ డాడీగా ఉండండి అని రాసి ఉంది. షుగర్ డాడీ అనేది విదేశాల్లో ఎప్పట్నుంచో ట్రెండింగ్‌లో ఉన్న ఓ కల్చర్. సంపన్న వ్యక్తి లేదా వయసు మళ్లిన వ్యక్తి.. డబ్బులు ఇచ్చి ఓ యువకుడు లేదా యువతిని కొన్ని రోజుల పాటు తమ భాగస్వామిగా నియమించుకుంటారు. అలా నియమించుకునే వ్యక్తిని షుగర్ డాడీ అంటారు. దాదాపు నాలుగేళ్లు ఛాహల్‌తో కలిసి ఉన్న ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుని భరణంగా రూ.4.75 కోట్లు అందుకుంటోందన్న వార్తలు వస్తున్నాయి.


మాజీ భార్య డిమాండ్ చేసిన భరణానికి కౌంటర్‌గానే ఛాహల్ ఈ టీ-షర్ట్ వేసుకుని వచ్చాడని చాలా మంది నెటిజన్లు భావిస్తున్నారు. ఛాహల్ ఆ టీ-షర్టు కావాలనే వేసుకున్నాడని, చాలా బాగా ఆడాడని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ భరణాన్ని ఉద్దేశిస్తూ ఆర్జే మహ్వాష్ కూడా నర్మగర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అబద్ధాలు, దురాశ, మోసాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ కామెంట్ చేసింది. ఇది కూడా ధన శ్రీని ఉద్దేశించినదే అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో ఆర్జే మహ్వాష్‌తో కలిసి ఛాహల్‌‌ కనిపించాడు. ఇద్దరూ సన్నిహితంగా కనిపించడంతో డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు షికారు చేశాయి.


ఇవి కూడా చదవండి..

Yuzvendra Chahal-Dhanashree: ఛాహల్-ధనశ్రీ వర్మకు విడాకులు.. మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు..


పాండ్యాకు మెంటల్ టార్చర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2025 | 09:05 PM