Yuzvendra Chahal: వేలంలో రూ.18 కోట్లు.. ఛాహల్ అభిప్రాయం ఏంటంటే

ABN, Publish Date - Apr 06 , 2025 | 07:59 PM

ఐపీఎల్‌లో 200కు పైగా వికెట్లు తీసిన ఒకే ఒక బౌలర్ అయిన ఛాహల్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18 కోట్లు వెచ్చింది దక్కించుకుంది. ప్రస్తుత ఐపీఎల్‌ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ శనివారం తొలి అపజయాన్ని నమోదు చేసింది.

Yuzvendra Chahal: వేలంలో రూ.18 కోట్లు.. ఛాహల్ అభిప్రాయం ఏంటంటే
Yuzvendra Chahal

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్ (Yuzvendra Chahal) ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో 200కు పైగా వికెట్లు తీసిన ఒకే ఒక బౌలర్ అయిన ఛాహల్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18 కోట్లు వెచ్చింది దక్కించుకుంది. ప్రస్తుత ఐపీఎల్‌ (IPL 2025)ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ శనివారం తొలి అపజయాన్ని నమోదు చేసింది. అయితే తమ జట్టు ఈ ఐపీఎల్‌లో కచ్చితంగా టాప్-2లో ఉంటుందని, విజేతగా నిలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని ఛాహల్ అభిప్రాయపడ్డాడు.


*మా టీమ్ సమతూకంగా ఉంది. నెంబర్ 9 వరకు బ్యాటింగ్ చేసే వాళ్లు ఉన్నారు. అలాగే 7-8 బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మా జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ ఏడాది ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు మా టీమ్‌కు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్‌లో స్థానం దక్కించుకోవడం పైనే దృష్టి సారించాం. పాయింట్ల పట్టికలో టాప్-2 ప్లేస్‌లో నిలిచే సత్తా మాకు ఉంది అని ఛాహల్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టులోని ఆటగాళ్లందరూ పరిస్థితులను ఎంజాయ్ చేస్తున్నారు * అని చెప్పాడు.


అలాగే రూ.18 కోట్ల భారీ ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి ఏమైనా ఉందా అనే ప్రశ్నకు కూడా ఛాహల్ సమాధానం చెప్పాడు. * నాకు వేలంలో రూ.6 కోట్లు పలికినా, రూ.18 కోట్లు పలికినా మైదానంలోకి దిగిన తర్వాత ఒకే మైండ్‌సెట్‌తో ఆడతాను. జట్టు విజయం కోసమే కష్టపడతాను. నేను చాలా సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఆడుతున్నా. 200కు పైగా వికెట్లు తీశా. నేను ఈ ప్రైస్ ట్యాగ్‌కు అర్హుడినే * అని ఛాహల్ పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 07:59 PM