ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Credit Card: మొదటిసారి క్రెడిట్ కార్డ్‌ తీసుకున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..

ABN, Publish Date - Jan 15 , 2025 | 04:29 PM

క్రెడిట్ కార్డు.. దీనిని ప్లాస్టిక్ మనీ అని కూడా అంటారు. ఒకప్పుడు కేవలం కొందరికి మాత్రమే పరిమితమైన క్రెడిట్‌ కార్డులు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయ్‌. ఈ కథనంలో క్రెడిట్ కార్డ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Credit Cards

Credit Card Using Tips: క్రెడిట్‌ కార్డ్‌.. ప్రస్తుత కాలంలో దీని వినియోగం పెరిగింది. దీనిని ప్లాస్టిక్ మనీ అని కూడా అంటారు. దీనిని చాలా జాగ్రత్తగా వాడాలి. లేదంటే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా, ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు వాడేవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీ మొదటి కార్డ్‌ దగ్గరి నుంచి మీ క్రెడిట్‌ హిస్టరీని పెంచుకోవల్సిన అవసరం చాలా ఉంది. భవిష్యత్ లో ఏ లోన్ కావాలనుకున్నా ఈ హిస్టరీనే మీకు ఉపయోగపడుతుంది. లేదంటే భవిష్యత్తులో అప్పు పుట్టడం కష్టమవుతుంది.

అధిక రివార్డ్‌ పాయింట్లతో పాటు ఆఫర్లు:

అత్యవసర పరిస్థితుల్లో ఈ క్రెడిట్ కార్డ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇతరుల నుండి చేబదులు తీసుకునేకంటే ఈ క్రెడిట్‌ కార్డులను స్టాండ్‌బైగా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే, కార్డును వాడిన దాదాపు 40 రోజుల వరకూ ఎలాంటి వడ్డీ ఉండదు. అయితే, అనవసర ఖర్చుల జోలికి వెళ్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడతారు. కార్డులలో ఫీజు, చార్జీలు, కో-బ్రాండెడ్‌ అని రకాలు ఉంటాయి. మన అవసరానికి ఏది పనికొస్తుందో దానిని మాత్రమే తీసుకోవాలి. వార్షిక ఫీజు చార్జ్‌ చేసే సంస్థలు అధిక రివార్డ్‌ పాయింట్లతో పాటు ఆఫర్లను కూడా ఇస్తుంటాయి. బాగా షాపింగ్ చేసే వాళ్లకు ఈ-కామర్స్ కంపెనీలు, ప్రయాణాలు బాగా చేసే వాళ్లకు ట్రావెల్ కంపెనీలతో కలిసి కో బ్రాండెడ్‌ కార్డులు లభిస్తాయి. వీటిలో కూడా రివార్డ్‌ పాయింట్లు, ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. కొద్దికాలం పాటు కేవలం ఒక కార్డుకే పరిమితమవ్వండి. మెల్లిగా క్రెడిట్‌ స్కోర్‌ పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీ పేమెంట్ సైకిల్‌ బాగుంటే మీ క్రెడిట్‌ లిమిట్ పెరుగుతుంది.


లిమిట్‌ మొత్తం వాడేయకండి:

బ్యాంక్‌ మీకు రూ.100 క్రెడిట్‌ లిమిట్‌ ఇస్తే, గరిష్టంగా రూ. 20-30 వరకూ మాత్రమే వినియోగించుకోవడం మంచిది. ఈ లిమిట్‌ ఎక్కువగా వాడితే, మీ క్రెడిట్‌ స్కోర్ తగ్గిపోతుంది. పేమెంట్‌ గడువు తేదీలోపు మీరు చెల్లించలేకపోతే క్రెడిట్ కార్డు సంస్థ మరో అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ కనీస పేమెంట్‌ చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌ ఏ మాత్రం ఎఫెక్ట్ కాదు, మిగిలిన క్రెడిట్‌ లిమిట్‌పై కూడా ఎలాంటి ప్రభావం పడదు. అయితే, చాలామంది, కేవలం కనీస బకాయి చెల్లింపు చేసి నెలలు పాటు పూర్తి పేమెంట్‌ను కట్టకుండా వాయిదా వేస్తూ ఉంటారు. దీని వల్ల మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. అందుకే బిల్లింగ్‌ సైకిల్‌లోపే మీరు పేమెంట్స్‌ మొత్తం చెల్లించాలి. లేదా ఈఎంఐ కన్వర్షన్‌ సౌకర్యం ఉందోమో చెక్‌ చేయండి. దీనివల్ల వడ్డీ సగానికి పైగా తగ్గుతుంది.

మూలన పడేయొద్దు:

RBI గైడ్‌లైన్స్ ప్రకారం ఏడాది పాటు తీసుకున్న క్రెడిట్ కార్డ్ వినియోగించకపోతే అది డీయాక్టివేట్‌ అవుతుంది. రెండు, మూడు నెలలకోసారి చిన్న మొత్తంలో అయినా సరే క్రెడిట్ కార్డు వాడి విలైనంత త్వరగా పేమెంట్ పూర్తి చేయండి. మనం బ్యాంకు నుండి క్రెడిట్ కార్డుల ద్వారా అప్పు తీసుకుంటున్నాం. అప్పు ఎప్పటికైనా ముప్పే. కాబట్టి, తీసుకున్న అప్పును త్వరగా తీర్చడానికి ప్రయత్నించండి.. లేదంటే 36-48 శాతం వరకూ వడ్డీ రేట్లు ఉంటాయి. అంటే రూ.100 కు రూ. 3 - 4 వరకూ వడ్డీ ఉంటుంది. దీనికి తోడు పేమెంట్ లేట్ చార్జీలు, ట్యాక్స్‌లు, పెనాల్టీ అంటి అధిక భారం పడుతుంది.

Updated Date - Jan 15 , 2025 | 04:38 PM