YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియేషన్స్ మరింత ఈజీ

ABN, Publish Date - Apr 07 , 2025 | 08:20 AM

ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్, క్రియేటర్ల కోసం ఒక సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో యూట్యూబ్ షార్ట్స్ కోసం ఏఐ ఆధారిత కొత్త ఫీచర్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియేషన్స్ మరింత ఈజీ
AI based features YouTube

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ క్రియేటర్ల కోసం క్రేజీ ఫీచర్‎ను అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో యూట్యూబ్ షార్ట్స్ కోసం AI ఆధారిత ఫీచర్‌లను తీసుకొస్తున్నట్లు చెప్పింది. ఈ ఫీచర్‌లు ప్రారంభకుల నుంచి ప్రొఫెషనల్ క్రియేటర్‌ల వరకు అందరికీ కంటెంట్ సృష్టించుకోవడంలో మరింత సులభతరం చేస్తాయని తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

AI ఎడిటింగ్

యూట్యూబ్ షార్ట్స్ కోసం AI ఎడిటింగ్ అనేది అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లలో ఒకటి. క్రియేటర్లు త్వరలో అనేక యాక్సెస్ అవకాశాలను పొందుతారు.


ఆటోమేటెడ్ సీన్ డిటెక్షన్

వీడియోలోని వివిధ సీన్లను ఆటోమేటిక్‌గా గుర్తించడం ద్వారా, సృష్టికర్తలు ఎడిటింగ్ సమయంలో సమయాన్ని ఆదా చేసుకుంటారు.

స్మార్టర్ ట్రాన్సిషన్‌లు

వీడియోల మధ్య స్మార్ట్ ట్రాన్సిషన్‌లను ఉపయోగించడం ద్వారా, వీడియోలు మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి.

వన్-ట్యాప్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్

కేవలం ఒక ట్యాప్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించడం ద్వారా, క్రియేటర్లు తమ వీడియోలను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

ఈ టూల్స్ ప్రస్తుత సంక్లిష్టమైన ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అవసరాన్ని తొలగించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్ వీడియోలను మరింత ఈజీగా మెరుగుపరచుకోవచ్చు.


AI జనరేటెడ్ స్క్రిప్ట్‌లు

క్రియేటర్లు ప్రస్తుతం వారి కంటెంట్‌ను స్క్రిప్ట్ చేయడం కొంత కష్టంగా అనిపించవచ్చు. కానీ, యూట్యూబ్..షార్ట్స్ కోసం AI స్క్రిప్ట్ జనరేటర్ తీసుకొస్తుంది. దీని ద్వారా క్రియేటర్లు తమ ఆలోచనలను త్వరగా స్క్రిప్ట్‌ రూపంలో మార్చుకోవచ్చు. ప్రస్తుత ట్రెండ్స్‌ను అనుసరించి, ఆకర్షణీయమైన హుక్స్‌ను రూపొందించుకోవచ్చు.

విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్

దీంతోపాటు యూట్యూబ్, AI ఆధారిత విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్‌లను పరిచయం చేస్తోంది. ఇవి సృష్టికర్తలకు మరింత ఆకర్షణీయమైన షార్ట్స్ వీడియోలను రూపొందించడంలో సహాయపడతాయి. వీడియోలలో మోషన్ గ్రాఫిక్స్‌ను చేర్చడం ద్వారా, కంటెంట్ మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. ఈ క్రమంలో క్రియేటర్లు తమ స్టోరీలను మరింత ఆసక్తికరంగా చెప్పే ఛాన్స్ ఉంటుంది.


కొత్త ఫీచర్లు

దీంతోపాటు షార్ట్స్ AI జనరేటెడ్ క్యాప్షన్‌లు, భాషా అనువాదం సహా అనేక ఫీచర్లను తీసుకొస్తున్నారు. వీటి ద్వారా డిజైన్ నైపుణ్యాలు లేకున్నా కూడా, క్రియేటర్లు తక్కువ సమయంలో ఆకర్షణీయమైన వీడియోలను రూపొందించుకోవచ్చని టెక్ వర్గాలు అంటున్నాయి. కేవలం కొన్ని ట్యాప్‌లతో మీరు స్టోరీని సిద్ధం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ ఫీచర్లు ఈ ఏడాదిలోనే అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఎప్పుడనేది మాత్రం స్పష్టంగా తెలియదు.


ఇవి కూడా చదవండి:

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 07 , 2025 | 09:04 AM