TikTok: అమెరికాలో టిక్‌టాక్ సేవలు పునరుద్ధరణ.. ట్రంప్‍కి థాంక్స్
ABN, Publish Date - Jan 20 , 2025 | 10:17 AM
టిక్‌టాక్ అమెరికాలో తిరిగి సేవలు అందించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ నిషేధాన్ని నివారించేందుకు సహాయపడతానని ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టిక్‌టాక్ (TikTok) అమెరికాలో వినియోగదారులకు తిరిగి సేవలను పునరుద్ధరించే ప్రక్రియలో ఉందని తెలిపింది. అంతకుముందు, సమాఖ్య చట్టం అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు ఈ యాప్ నిలిపివేయబడింది. గత అమెరికా అధ్యక్షడు జో బైడెన్ ఈ యాప్ నిషేధ చట్టంపై సంతకం చేశారు. ఆ క్రమంలో డిజిటల్ స్టోర్లు, ఇతర సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కూడా టిక్‌టాక్ యాప్‌ను తొలగించాలన్నారు. లేదంటే ఆయా టెక్నాలజీ కంపెనీలు జరిమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. అయితే తాజాగా నిషేధం విషయంలో సహాయం చేయడానికి కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాయని టిక్‌టాక్‌ను నిర్వహిస్తున్న కంపెనీ Xలో ఒక పోస్ట్ చేసింది.
టిక్ టాక్ ధన్యవాదాలు
ఈ క్రమంలోనే అమెరికాలో టిక్‌టాక్ తిరిగి ఆన్‌లైన్‌లోకి వస్తుందని ఆదివారం రాత్రి ట్రంప్ ప్రకటించారు. టిక్‌టాక్‌ను మూసివేస్తామని బెదిరించిన బైడెన్ పరిపాలనను 'స్టంట్'గా అభివర్ణించారు ట్రంప్. ''నిజం చెప్పాలంటే, మనకు వేరే మార్గం లేదు, మనం దీనిని కాపాడుకోవాలన్నారు. డివెస్ట్-లేదా-బ్యాన్ చట్టాన్ని ఆలస్యం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చైనాకు చెందిన మాతృ సంస్థ నిషేధాన్ని నివారించడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి సోమవారం తన ప్రమాణ స్వీకారం తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్‌నకు టిక్‌టాక్ కృతజ్ఞతలు తెలిపింది.
యాప్ ఓపెన్ చేస్తే..
ఈ క్రమంలో యూఎస్ యూజర్లు టిక్ టాక్ యాప్ ఓపెన్ చేయగానే ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టిక్‌టాక్‌ను పునరుద్ధరించడానికి మాతో కలిసి పనిచేస్తానని సూచించడం మా అదృష్టం" అని వస్తుంది. అప్పటివరకు మాతోనే ఉండాలనే సమాచారం వచ్చింది. ఈ యాప్ పై నిషేధం విధించినప్పుడు “యూఎస్‌లో టిక్ టాక్‌ని నిషేధించడానికి ఒక చట్టం ఆమోదించబడిందని రాసి ఉన్న సందేశం వచ్చింది. దీని అర్థం దురదృష్టవశాత్తు మీరు ఇకపై TikTok ని ఉపయోగించలేరని చూపించింది. దీనికి ముందు టిక్‌టాక్‌ను నిషేధించే యూఎస్ చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి వస్తుంది.
50 శాతం వాటా గురించి కీలక వ్యాఖ్యలు..
ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో 50 శాతం యాజమాన్యాన్ని ప్రభుత్వం కలిగి ఉండటానికి అనుమతించాలని ట్రంప్ అన్నారు. ఒక చట్టం కారణంగా శనివారం రాత్రి అమెరికాలో టిక్‌టాక్ మూసివేయబడింది. కానీ ట్రంప్ సూచన తర్వాత అది తిరిగి వస్తుంది. ఈ యాప్‌ను 170 మిలియన్ల అమెరికన్లు ఉపయోగిస్తున్నారు. విక్టరీ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ, టిక్‌టాక్ తిరిగి వచ్చిందని అన్నారు. మనం చాలా ఉద్యోగాలను ఆదా చేయాలని, మేము మా వ్యాపారాన్ని చైనాకు అప్పగించాలనుకోవడం లేదు. మేము మా వ్యాపారాన్ని ఇతరులకు అప్పగించాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
Smart Lock System: దొంగలను పట్టించిన స్మార్ట్ లాక్ సిస్టమ్.. ఎలాగంటే..
WhatsApp: మీ వాట్సాప్ మెసేజ్‌లు వారు చదువుతారా.. మార్క్ జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు
ChatGPT: వినియోగదారుల కోసం చాట్‌జీపీటీ నుంచి వీడియో ఇంటరాక్షన్ ఫీచర్
WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..
Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..
Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
For More Technology News and Telugu News
Updated Date - Jan 20 , 2025 | 12:10 PM