Share News

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్‌మేళా

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:12 PM

నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్‌ సౌజన్యంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని యువతులకు స్థానిక రోజ్‌ గార్డెన్‌లో జాబ్‌ మేళా నిర్వహించారు.

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్‌మేళా
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

- ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్‌ సౌజన్యంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని యువతులకు స్థానిక రోజ్‌ గార్డెన్‌లో జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలన్నారు. దాని కోసమే నియోజక వర్గంలోని నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్‌ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా హైదరా బాద్‌లోని ప్రముఖ కంపెనీలో ఉత్పత్తి కేంద్రాల వద్ద ప్యాకింగ్‌ సెక్షన్‌లో యువతులు పని చేయాల్సి ఉంటుందన్నారు. నియోజకవర్గం నుంచి రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నట్లు తెలిపారు. జాబ్‌ మేళా నిర్వహ ణకు యువతులు పెద్దఎత్తున తరలిరావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఎస్‌కేఎస్‌ఎస్‌ ఫీల్డ్‌ మేనేజర్‌ కృష్ణ, శివలు మాట్లాడుతూ యువతులకు 19 వేల వేతనం చెల్లించడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ఉంటుంద న్నారు. అవకాశాలు ఎప్పుడు రావని వచ్చిన అవకా శాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కృషితో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెంటనే ఉద్యోగంలో చేరిన వారికి బోనస్‌ చెల్లించడం జరుగుతుందన్నారు. అనంతరం యువ తుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు సాయినాథ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, నాయకులు రవీందర్‌, సౌందర్య, పోచయ్య, సంజీవ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 11:12 PM