మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:11 PM
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ మధ్యాహ్న బోజన కార్మికుల యూనియన్ ఆద్వర్యంలో బుధవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.

నస్పూర్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ మధ్యాహ్న బోజన కార్మికుల యూనియన్ ఆద్వర్యంలో బుధవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా విద్యాధికారి యాదయ్యలకు అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక యూనియన్ అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, కార్యదర్శి ఎండీ రఫీయా, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ బడ్జెట్‌లో కార్మికులకు వేతనాలను నిర్ణయించి చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను, బిల్లులను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 10వేల వేతనం అమలు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వవద్దన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం యూనియన్ నాయకులు భాగ్య, మధునమ్మ, మల్లమ్మ, కళావతి, గురువక్క, గట్టక్క, మంజుల, సీఐటీయూ నాయకులు దూలం శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయాలని ఆశ వర్కర్ల..
నస్పూర్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల యూనియన్ ఆధ్వర ్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు ఉరేగింపుగా తరలివచ్చారు. ప్రధాన ద్వారా వద్ద ఆందోళనకు దిగారు. సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఆశలు నినాదాలు చేసారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటి డీఎంహెచ్‌వో అనితకు అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు సోమిడి సమ్మక్క, శోభ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ. 18వేలను చెల్లించాలన్నారు. ఆందోళనలో రాణి, కవిత, అరుంధతి, సుజాత, సువర్ణ, సీఐటీయు జిల్లా ఉపాధ్యాక్షుడు ప్రకాష్, నాయకులు దూలం శ్రీనివాస్, అంబటి లక్ష్మన్‌లతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ఆశ వర్కర్లు పాల్గొన్నారు.