Cancer Hospital: బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ప్రత్యేక పరిశోధన కేంద్రం
ABN, Publish Date - Apr 05 , 2025 | 05:18 AM
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి-రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్‌పై పరిశోధనలకు ఏర్పాటు చేసినప్రత్యేక కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు.

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి-రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్‌పై పరిశోధనలకు ఏర్పాటు చేసినప్రత్యేక కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అమెరికాకు చెందిన ప్రవాసాంధ్ర దంపతులు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, కల్యాణి ఈ కేంద్రానికి రూ. 10 కోట్లు అందించారు. దీంతో ఈ కేంద్రానికి కల్యాణి ప్రసాద్ క్యాన్సర్ రీసెర్చి సెంటర్‌గా నామకరణం చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. పాతికేళ్లు పూర్తి చేసుకొని రజతోత్సవాలను జరుపుకొంటున్న వేళ ప్రత్యేక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషాన్నిస్తోందన్నారు. దీన్ని ఏర్పాటుకు భారీ విరాళాన్ని అందించిన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, కల్యాణి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ నిర్వహించే పరిశోధనలు దేశంలోని క్యాన్సర్ రోగులకు సాంత్వన కలిగిస్తాయని ఆశిస్తున్నట్లు వివరించారు.
Updated Date - Apr 05 , 2025 | 05:22 AM