CM Revanth Reddy: సర్వాయి పాపన్నకు సీఎం రేవంత్ నివాళి
ABN, Publish Date - Apr 03 , 2025 | 05:44 AM
నిరంకుశ రాచరికాన్ని వ్యతిరేకించిన బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): నిరంకుశ రాచరికాన్ని వ్యతిరేకించిన బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. బుధవారం సర్వాయి పాపన్న వర్థంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని సీఎం నివాసంలో పాపన్న చిత్రపటానికి రేవంత్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వందల ఏళ్ల క్రితమే రాజకీయ, సామాజిక సమానత్వానికి సబ్బండ వర్గాలను ఏకం చేసి పోరాడిన యోధుడు పాపన్న అని తెలిపారు. ఎంపీలు మల్లు రవి, కిరణ్‌కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, రఘురాం రెడ్డి, వంశీకృష్ణ, అనిల్‌కుమార్ యాదవ్ కూడా సర్వాయి పాపన్నకు నివాళులర్పించారు.
Updated Date - Apr 03 , 2025 | 05:44 AM