Traditional Gifts: ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది?

ABN, Publish Date - Mar 23 , 2025 | 03:55 AM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శనివారం చెన్నైలో జరిగిన సమావేశానికి హాజరైన నేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాలువా కప్పి, ఓ బాక్స్‌ను బహూకరించారు.

Traditional Gifts: ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది?
  • స్టాలిన్‌ ఇచ్చిన గిఫ్ట్‌పై సర్వత్రా చర్చ

చెన్నై, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శనివారం చెన్నైలో జరిగిన సమావేశానికి హాజరైన నేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాలువా కప్పి, ఓ బాక్స్‌ను బహూకరించారు. దీనిని టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారంలో చూసిన వారంతా ఆ పెట్టెలో ఏముందంటూ ఆసక్తిగా చర్చించుకున్నారు. అయితే, తమిళ సంప్రదాయం, సంస్కృతిని తెలిపే అమూల్యమైన వస్తువులు బాక్స్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.


అందులో పత్తుమడై పాయ్‌ (పత్తుమడై చాప), ఊటీలో తోడర్‌ కులస్థులు ధరించే శాలువా, కాంచీపురం చేనేత పట్టుచీర, ఊటీ వర్గీ, కన్యాకుమారి జిల్లా కోవిల్‌పట్టికి చెందిన శెనగ మిఠాయి, ఈరోడ్‌ పసుపు, కొడైకెనాల్‌ వెల్లుల్లి ఉన్నట్లు సమాచారం. ఈ వస్తువులన్నీ అంతర్జాతీయ గుర్తింపు కలిగినవి. అందుకే వాటిని బహూకరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 23 , 2025 | 03:55 AM