Online Betting: తెలంగాణలో నిషేధమున్నా లాగిన్‌ ఎలా?

ABN, Publish Date - Jan 30 , 2025 | 04:44 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లపై తెలంగాణలో నిషేధం ఉన్నప్పటికీ ఆయా వెబ్‌సైట్ల వినియోగానికి ఇక్కడి ప్రజలన ఎలా అనుమతిస్తున్నారు ? అంటూ సంబంధిత వెబ్‌సైట్ల నిర్వాహకులు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో నిలదీసింది.

Online Betting: తెలంగాణలో నిషేధమున్నా లాగిన్‌ ఎలా?
  • బెట్టింగ్‌, గేమింగ్‌ వెబ్‌సైట్ల నిర్వాహకులకు రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ప్రశ్న

  • ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ఉన్నతస్థాయి సమావేశం

  • పలు బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ సైట్లకు నోటీసులు జారీ

హైదరాబాద్‌, జనవరి 29(ఆంధ్రజ్యోతి) : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లపై తెలంగాణలో నిషేధం ఉన్నప్పటికీ ఆయా వెబ్‌సైట్ల వినియోగానికి ఇక్కడి ప్రజలన ఎలా అనుమతిస్తున్నారు ? అంటూ సంబంధిత వెబ్‌సైట్ల నిర్వాహకులు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో నిలదీసింది. ఈ మేరకు పలు బెట్టింగ్‌, గేమింగ్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఓ విషవలయంగా మారిన నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీల నిర్వాహకులతో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో బుధవారం సమావేశం నిర్వహించింది. ఆలిండియా గేమింగ్‌ ఫెడరేషన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫాంటసీ స్పోర్ట్స్‌, పలు గేమింగ్‌ కంపెనీల సీఈఓలు, ఇంటర్నెట్‌ సర్వీసు ప్రోవైడర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం ప్రతినిదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


రాష్ట్రంలో నిషేధం ఉన్న గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ల్లోకి తెలంగాణ వాసులను ఎలా అనుమతిస్తున్నారని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ షికా గోయల్‌ ప్రశ్నించారు. తెలంగాణలో నమోదైన ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా ఉన్న వ్యక్తులకు నిషేధిత గేమింగ్‌ సైట్లలో లాగిన్‌ అయ్యేందుకు అవకాశం ఇవ్వడం ఏంటనీ అడిగారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌కు బానిసలై పలువురు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బెట్టింగ్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. గేమింగ్‌ సంస్థలు జియో ఫెన్సింగ్‌ పాటించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. చట్టాలను గౌరవించని గేమింగ్‌ కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అలాగే, విదేశాల్లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించే ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్ల పర్యవేక్షణకు, ఆయా కంపెనీలు స్థానిక చట్టాలను గౌరవించేలా చేసేందుకు ఓ నియంత్రణ విభాగం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశామని షికా గోయల్‌ తెలిపారు. కాగా, నిషేధిత గేమింగ్‌ యాప్‌ల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై 1930కు ఫోన్‌ చేసి తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


ఇవీ చదవండి:

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య

టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య

ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 04:44 AM