Devadula Pump House: ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద టన్నెల్ లీకేజీ
ABN, Publish Date - Mar 31 , 2025 | 06:00 AM
హనుమకొండ జిల్లా దేవన్నపేటలోని దేవాదుల పంప్‌హౌస్‌లో టన్నెల్ లీకేజీతో రైతులు ఆందోళన వ్యక్తం చేసిన సమయంలో అధికారులు మోటార్లు నిలిపివేసి ప్రమాదాన్ని అడ్డుకున్నారు. రెండు రోజుల్లో లీకేజీ మరమ్మతు చేసి మోటార్లు పునఃప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు

అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
మోటార్లు ఆన్ చేసిన నాలుగు రోజులకే..
ఆందోళనలో నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు
హనుమకొండ టౌన్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : హనుమకొండ జిల్లా దేవన్నపేటలోని దేవాదుల పంప్‌హౌస్ మూడో దశ పంపులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మోటార్లను ఆన్ చేసిన నాలుగు రోజులకే ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద టన్నెల్ లీకవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం రెండు గంటలు నీరు లీకవగా పంటలు మునిగే క్రమంలో అధికారులు అప్రమత్తమై మోటార్లను నిలిపివేశారు. రెండు రోజుల్లో లీకేజీని సరి చేసిన తర్వాత మోటార్లు ఆన్ చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా దేవన్నపేట పంప్‌హౌస్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 43 అడుగులు కాగా ప్రస్తుతం 36.8 అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
మరో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..
ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో రైళ్లు..
Updated Date - Mar 31 , 2025 | 06:00 AM