ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కేర్‌ యూనిట్‌ విస్తరణ

ABN, Publish Date - Apr 03 , 2025 | 05:48 AM

తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ కేర్‌ యూనిట్‌ను విస్తరించాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 4 పడకలుండగా వాటికి అదనంగా 8 పడకల్ని సంస్థ ఏర్పాటు చేయనుంది.

ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కేర్‌ యూనిట్‌ విస్తరణ
  • పడకల సంఖ్య 12కు పెంపు.. ఐఓసీఎల్‌ సాయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ కేర్‌ యూనిట్‌ను విస్తరించాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 4 పడకలుండగా వాటికి అదనంగా 8 పడకల్ని సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌ విస్తరణకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్‌) కింద నిధులు కేటాయించాలని ఆర్టీసీ ప్రతిపాదనలకు ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) అంగీకరించింది. కోటి రూపాయలు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. నిర్మాన్‌ డాట్‌ ఓఆర్‌జీ అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఈ యూనిట్‌ను ఐఓసీఎల్‌ విస్తరించనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షణకు ప్రత్యేకకేంద్రాల ఏర్పాటుకూ సహకరించనుంది.


హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో బుధవారం సజ్జనార్‌ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఐఓసీఎల్‌ ప్రతినిధులు ఎస్‌సీ మెస్‌రాం, పి. కేౖలాష్‌ కాంత్‌, వీవీఎస్‌ చక్రవర్తి, నిర్మాన్‌ డాట్‌ ఓఆర్‌జీ సీఓఓ పుల్లా అనురాధతో పాటు తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శైలజా మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఆర్టీసీలో పదవీ విరమణ తర్వాత కాంట్రాక్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అయిన విశ్రాంత ఐపీఎస్‌ డా. రవీందర్‌ నుంచి ఓఎస్డీలు, తదితర విభాగాల్లో పనిచేస్తున్న 20 మందిని తొలగించారు.


ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలి: ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైౖర్మన్‌ వెంకన్న నేతృత్వంలో ప్రతినిధి బృందం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు బుధవారం వినతిపత్రం అందజేసింది.

Updated Date - Apr 03 , 2025 | 05:48 AM