ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫన్‌ బకెట్‌ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు

ABN, Publish Date - Jan 11 , 2025 | 05:08 AM

వెబ్‌ సిరీ్‌సలో అవకాశం కల్పిస్తానంటూ బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడిన యూ ట్యూబర్‌, ఫన్‌ బకెట్‌ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విఽధిస్తూ పోక్సో కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.

  • బాలికపై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు తీర్పు

పెందుర్తి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): వెబ్‌ సిరీ్‌సలో అవకాశం కల్పిస్తానంటూ బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడిన యూ ట్యూబర్‌, ఫన్‌ బకెట్‌ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విఽధిస్తూ పోక్సో కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్‌ టిక్‌ టాక్‌ వీడియోలతో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో విశాఖ జిల్లా పెందుర్తి మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక అతనికి పరిచయమైంది. వెబ్‌ సిరీ్‌సలో అవకాశాలు కల్పిస్తానంటూ ఆమెకు ఆశ చూపించి శారీరకంగా లోబరుచుకున్నాడు.


బాలికలో వచ్చిన శారీరక మార్పులను తల్లి గుర్తించి వైద్యులకు చూపించగా నాలుగు నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లి 2021 ఏప్రిల్‌ 16న పెందుర్తి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ అశోక్‌కుమార్‌ కేసు నమోదుచేసి దిశ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. విశాఖ దిశ స్టేషన్‌ ఏసీపీ కాజల్‌ ఆఽధ్వర్యంలో కేసు దర్యాప్తు జరిగింది. భార్గవ్‌ బాలికను మోసం చేసి గర్భవతిని చేశాడని నిర్ధారణ కావడంతో ముద్దాయికి శిక్షపడింది.

Updated Date - Jan 11 , 2025 | 05:08 AM