Gangula Kamalakar: ధాన్యం టెండర్లలో 1000కోట్ల కుంభకోణం
ABN, Publish Date - Mar 27 , 2025 | 04:05 AM
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో చేపట్టిన ధాన్యం టెండర్లలో రూ.700కోట్ల నుంచి రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.
సీబీఐ దర్యాప్తు చేయించాలి: గంగుల కమలాకర్
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో చేపట్టిన ధాన్యం టెండర్లలో రూ.700కోట్ల నుంచి రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన కుంభకోణాన్ని ప్రశ్నిస్తానన్న భయంతోనే అసెంబ్లీలో పౌరసరఫరాలశాఖ పద్దులపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. ఈ ధాన్యం టెండర్లపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, రేషన్ కార్డులకు పలు దఫాలుగా దరఖాస్తులు తీసుకున్నారని, కానీ, 15నెలల్లో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు.
Updated Date - Mar 27 , 2025 | 04:05 AM