CM Revanth Reddy: బీరు బిర్యానీ లాంటి బీర్ బ్రాండ్లకు చెక్..
ABN, Publish Date - Jan 12 , 2025 | 10:40 AM
గత ప్రభుత్వ (బీఆర్ఎస్) హయాంలో ఏడాదిలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. ఎవరికి పడితే వారికి అనుమతించే విధానముండేది. ఇప్పుడలా కాకుండా కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శక విధానం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు.
హైదరాబాద్: బీరు బిర్యానీ (Beer Biryani) లాంటి బీర్ బ్రాండ్లకు (Beer Brands) రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Govt.) చెక్ (Check) పెట్టింది. గత ప్రభుత్వ (BRS) హయాంలో ఏడాదిలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. ఎవరికి పడితే వారికి అనుమతించే విధానముండేది. ఇప్పుడలా కాకుండా కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శక విధానం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు దరఖాస్తులు తీసుకోవద్దని.. కట్టుదిట్టంగా కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విధానం అనుసరించాలని,. నోటిఫికేషన్ జారీ చేసి నిర్ణీత వ్యవధిలో దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల నాణ్యత, మార్కెట్లో వాటికి ఉన్న ఆదరణ, సరఫరా సామర్థ్యం ఆధారంగా కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వాలని సూచించారు. ఇష్టమోచ్చిన చెత్త పేర్లతో వచ్చేవి.. నాసిరకం కంపెనీలకు నో ఎంట్రీ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో బీర్లు, లిక్కర్ సరఫరా చేస్తున్న కంపెనీలు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పాత కంపెనీలు కొత్త బ్రాండ్లు ఉత్పత్తి చేస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంలో వాటిని పరిశీలించి అనుమతించే పద్ధతి అనుసరించాలన్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న మైక్రో బ్రూవరీలు, ఎలైట్ బార్ల అప్లికేషన్లు, ఖాళీగా ఉన్న ఎలైట్ బార్లు, ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపుల విషయంలో త్వరలో కొత్త విధానం రూపొందిస్తామన్నారు. గతంలో టానిక్ లాంటి ఎలైట్ షాపులకు అనుమతించటంతో బడా వ్యాపారులు ఎక్సైజ్ శాఖను తమ గుప్పిట పెట్టుకున్నారు. తాము ఆడిందే ఆట అన్నట్లుగా ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి ఎక్సైజ్ ఆదాయం గండి పడకుండా కొత్త ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు.
ఈ వార్త కూడా చదవండి
సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్నారా.. జాగ్రత్త..
రాష్ట్రంలో త్వరలోనే కొత్త బ్రాండ్లతో కూడిన బీర్లు రానున్నాయి. ఈ మేరకు బీర్ల ఉత్పత్తి కోసం మద్యం కంపెనీలను ఆహ్వానించాలని.. దరఖాస్తులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరిలోపు కంపెనీలను ఖరారు చేసి, మార్చి నుంచే కొత్త బ్రాండ్లు షాపుల్లోకి వచ్చే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదంటూ రాష్ట్రంలోని ప్రముఖ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) బీర్ల ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. బీర్ల విక్రయాల్లో ఈ కంపెనీ దాదాపు 70శాతం వాటా కలిగి ఉండటంతో రాష్ట్రంలో త్వరలో బీర్ల కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖజానాకు అధిక ఆదాయం కావాల్సినప్పుడల్లా గత ప్రభుత్వం మద్యం ధరలు పెంచి వినియోగదారులపై భారం మోపిందని, ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ధరలు పెంచలేదన్నారు. పెంచాల్సిందే అంటూ మద్యం తయారీదారులు పేర్కొనడం.. ప్రభుత్వాన్ని నియంత్రించాలని చూడటమే అవుతుందని.. అలాంటి బ్లాక్‌మెయిలింగ్ బెదిరింపులకు ప్రభుత్వం తలొగ్గదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీరామవతార అలంకారంలో నరసింహుడి దర్శనం
కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద బారులు తీరుతున్న వాహనాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 12 , 2025 | 10:40 AM