Share News

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ముందడుగు

ABN , Publish Date - Jan 19 , 2025 | 12:45 PM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ సింగపూర్ పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ముందడుగు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సింగపూర్ పర్యటన (Singapore Visit) విజయవంతంగా కొనసాగుతోంది. ఆయన పర్యటన ఫలిస్తోంది. పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు (Industrialists) ముందుకొస్తున్నారు. కొన్ని పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మరో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాపిటల్ ల్యాండ్ (Capitalland) ముందుకొచ్చింది. 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్‌ (IT Park) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో క్యాపిటల్యాండ్ కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రీమియం సౌకర్యాలను కోరుకునే బ్లూ-చిప్ కంపెనీలు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను కొత్త ప్రాజెక్ట్ తీర్చనుంది. క్యాపిటల్ ల్యాండ్ కొత్త ప్రాజెక్ట్, హైదరాబాద్ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.


హైదరాబాద్ సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిలో ఇదొక మైలురాయిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు వ్యాపార పార్కులను కాపిటాల్యాండ్ నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ (ITPH), Avance హైదరాబాద్, సైబర్ పెర్ల్ ఏర్పాటు చేసిన క్యాపిటల్ ల్యాండ్ హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ITPH) రెండవ దశ పనులు ఈ ఏడాది ప్రారంభమై 2028నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మంచి ఫలితాలు రాబడుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి బృందం సింగపూర్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. క్యాపిటల్ ల్యాండ్ ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. ప్రపంచంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. వివిధ వ్యాపారాలు సైతం చేస్తోంది. రిటైల్ ఆఫీస్, లాజిస్టిక్స్, డేటా సెంటర్ల ద్వారా కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ కంపెనీలో హైదరాబాద్‌లో మూడు రకాల వ్యాపారాలు చేస్తోంది.


కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్‌ తొలిరోజు పర్యటనలోనే కీలక ఒప్పందం జరిగింది. సింగపూర్ ఐటీఈ ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో తెలంగాణలో ఎంగ్ ఇండియా యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ వర్శిటీ ఉపయోగించుకోనుంది. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీ వీసీ, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ మధ్య ఒప్పందం కుదిరింది.

సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించారు. అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు. అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాదులోని ఫోర్ల్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.


నైపుణ్యాల అభివృద్ధి (స్కిల్ డెవెలప్మెంట్) శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు. దీనిపై ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం తరఫున అకడిమిక్ అండ్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సంతకాలు చేశారు. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను సందర్శించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హెల్త్ వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం..

అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 19 , 2025 | 04:06 PM