CM Revanth Reddy: జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Jan 27 , 2025 | 08:45 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యప్రదేశ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఇండోర్ జిల్లా మోవ్‌లో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు.

CM Revanth Reddy: జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఇండోర్‌ (Indore)కు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరతారు. ఇండోర్ జిల్లా మోవ్‌లో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ (Jai Bapu, Jai Bhim, Jai Samvidhan) కార్యక్రమం (Program)లో పాల్గొంటారు. మోవ్‌లోని వెటర్నరీ గ్రౌండ్ లో ఏఐసీసీ (AICC) కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ నేతలు (All India Congress leaders) హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి రాత్రి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఈ వార్త కూడా చదవండి..

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా


అంబేద్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్‌లో నిర్వహించనున్న ‘సంవిధాన్ బచావో‘ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ ర్యాలీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో ముఖ్యమంత్రి వెంట పలువురు ప్రముఖులు కూడా వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కూడా సీఎంతో పాటు వెళుతున్నారు. మహూ కంటోన్మెంట్ ప్రాంతంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం, ఆయన రాజ్యాంగ రచనలో చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ జరగనుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య మూలసిద్ధాంతాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పనున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరాన్ని ఆయన వివరిస్తారు.


‘సంవిధాన్ బచావో’ ర్యాలీకి రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, రాష్ట్ర రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ ర్యాలీపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అంబేద్కర్ స్వగ్రామం నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ సందేశం తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ర్యాలీ ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత బలపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించనున్నారు. ఈ ర్యాలీ విజయవంతంగా పూర్తవుతుందని పార్టీ నాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కస్టోడియల్ టార్చర్ కేసు.. పోలీసుల కస్టడీకి తులసిబాబు..

రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 27 , 2025 | 08:45 AM