Road Accdent: హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం..
ABN, Publish Date - Mar 23 , 2025 | 08:33 AM
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళుతున్న కారు.. నార్సింగీ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. అవతల వైపు గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్ట్ వైపు వెళుతున్న టాటా సఫారీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కార్లు డ్యామేజ్ అయ్యాయి. మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ శివరాంపల్లి కి చెందిన ఆనంద్ కాంబ్లీగా గుర్తించారు.

హైదరాబాద్: నార్సింగీ (Narsingi) ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road)పై ఆదివారం తెల్లవారుజామున కారు (Car) బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో కారు డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టి.. అవతల వైపు ఎదురుగా వెళుతున్న టాటా సఫారి కారు (Tata Safari car)ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అనంద్ కామ్లే అనే వ్యక్తి అక్కడే మృతి చెందాడు. అలాగే టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో కారు రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
Also Read..:
నాడు ఎన్టీఆర్‌పై హైకోర్టులో రిట్ పిటిషన్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళుతున్న కారు.. నార్సింగీ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. అవతల వైపు గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్ట్ వైపు వెళుతున్న టాటా సఫారీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కార్లు డ్యామేజ్ అయ్యాయి. మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ కాంబ్లీగా గుర్తించారు. ఆనంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో డీలిమిటేషన్ సమావేశం..
బీరు సీసాతో కొట్టి బాలికను చంపి..
For More AP News and Telugu News
Updated Date - Mar 23 , 2025 | 08:33 AM