HCU Security: పోలీసుల అలర్ట్... హెచ్‌సీయూ వద్ద భారీ భద్రత
ABN, Publish Date - Mar 31 , 2025 | 11:33 AM
HCU Security: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

హైదరాబాద్, మార్చి 31: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) వద్ద పోలీసులు (Telangana Police) భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థుల (Students) ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ పెంచారు. యూనివర్శిటీ లోపల బయట భారీగా పోలీసుల మోహరించారు. వర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్ లతో చదును చేసేందుకు యత్నించడంతో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సిబ్బంది భగ్గుమన్నాయి.
యూనివర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలంటూ స్టూడెంట్స్ గళమెత్తారు. దీంతో నిన్న (ఆదివారం) రాత్రి యూనివర్శిటీ పరిసరాలు రణ రంగంగా మారాయి. రాత్రి యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను, విద్యార్థి నేతలను రాత్రి 10 తర్వాత విడుదల చేశారు. అయితే ఈరోజు (సోమవారం) కూడా ఆందోళనలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
Ruthuraj Gaikwad: ఆర్ఆర్‌తో ఓటమికి కారణం అదే.. సీఎస్‌కే కెప్టెన్
హెచ్‌సీయూ వద్ద పోలీసులు భద్రతను కొనసాగిస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన ప్రధాన ద్వారంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ లోపల కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన భూములను ప్రభుత్వం వేలం వేసే ప్రయత్నం చేస్తోందంటూ వర్సిటీకి చెందిన విద్యార్థులు, సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గత రాత్రి విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నిన్నంతా వర్సిటీ లోపల, బయట రణరంగంగా మారింది. ఈ క్రమంలో ఈరోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగుతాయని భావించిన పోలీసులు.. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వర్సిటీ లోపలకు వెళ్లే వారి వివరాలను అడిగి తెలుసుకుని.. యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పంపిస్తున్నారు.
వర్సిటికీ సంబంధించి సుమారు 400 ఎకరాల భూమిని వేలం వేయాలంటూ ప్రభుత్వం భావిస్తోంది. టీజీఐఐసీ ద్వారా ఈ భూములను వేలం వేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా భూములను చదును చేసే ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నిన్న బుల్డోజర్లతో నాలుగు వందల ఎకరాల భూములను చదును చేసేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా విద్యార్థులు చొచ్చుకొచ్చారు. భూముల చదును ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. అప్పటికే పోలీసులు భారీ మోహరించి ఉండటంతో విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేయడంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు.. స్టూడెంట్స్ అందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందులో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. అయితే 400 ఎకరాలు యూనివర్సిటీకి చెందిన భూమి కాదని.. అందుకనే వేలం వేస్తున్నట్లు ఓ వైపు ప్రభుత్వం చెబుతుండగా.. ఇదంతా యూనివర్సిటికీ చెందిన భూమే అంటూ విద్యార్థులు చెబుతున్నారు.
విద్యార్థులపై కేసులు
మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరు పీహెచ్‌డీ స్కాలర్స్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఎర్రం నవీన్ కుమార్, డాక్టర్.రోహిత్ బొండుగులపై సెక్షన్ 329(3),118(1),132,191(3),351(3)r/w3(5) బీఎన్‌ఎస్ యాక్ట్ కింది కేసు పెట్టారు గచ్చిబౌలి పోలీసులు. ఒకరు ఏబీవీపీ కాగా మరొకరు ఎస్‌ఎఫ్‌ఐ యూనియన్‌కు చెందిన విద్యార్థులు.
ఇవి కూడా చదవండి
Pastor Praveen: విజయవాడలో ఆ 4 గంటలు..
Nagar Kurnool Incident: దైవదర్శనానికి వచ్చిన మహిళపై దారుణం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 31 , 2025 | 04:56 PM