Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
ABN , Publish Date - Mar 20 , 2025 | 09:26 AM
బెట్టింగ్ యాప్స్ వల్ల ఇటీవల పలువురు బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రముఖులు వీటిని ప్రచారం చేస్తుండటంతో బాధితులు వీటికి వెంటనే ఆకర్షితులు అవుతున్నారు. ఈ యాప్‌ల వల్ల బాధితులు తనువు చాలిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు.. ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై కేసులు నమోదు చేసి.. నోటీసులు ఇస్తున్నారు.

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ (Betting Apps)ను ప్రమోట్ చేసిన వారిలో మరో ఆరుగురికి పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police)నోటీసులు (Notices) ఇచ్చారు. దీంతో వారు గురువారం పంజా గుట్ట పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న నటి శ్యామల (Shyamala), రీతు చౌదరి (Ritu Choudary), అజయ్ (Ajay), సుప్రీత, సన్నీ సుధీర్ (Sunny Sudheer), అజయ్ సన్నీ(Ajay Sunny)లకు నోటీసులు ఇచ్చారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్‌తో పాటు హర్ష సాయి దుబాయ్‌కి పరారయ్యారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పంజాగుట్ట పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. హీరోయిన్లు హీరోలతో పాటు మరికొంత మంది ప్రమోటర్లపై పోలీసులు నిఘా ఉంచారు. కాగా ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్..విచారణకు హాజరయ్యారు.
Also Read..:
ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం..
పెద్దఎత్తున ప్రకటనలు..
కాగా బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్‌లు నిర్వహించేవారు పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తు మోసగిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల బారినపడుతున్న బాధితులు అప్పులపాలై ఆత్మహత్మలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, సెలబ్రిటీలు కూడా బాధితులు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రముఖులు బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తుండటంతో యువత వీటికి వెంటనే ఆకర్షితులు అవుతున్నారు. బెట్టింగ్ యాప్‌ల వల్ల ఎంతగానో నష్టపోతున్నారు. క్రమంగా అప్పుల పాలై జీవితాన్ని చాలిస్తున్నారు. ఇలాంటి యాప్‌లు సమాజానికి చాలా నష్టం కలిగిస్తుండటంతో పోలీసులు ఈ బెట్టింగ్ యాప్‌లపై ఫోకస్ పెట్టారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు..
వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌లపై కేసు నమోదు చేశారు. అమాయకులను మోసం చేసి రూ. వందల కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లను పోలీసులు కటకటాల్లోకి నెడుతున్నారు. అతిపెద్ద మల్టీలెవల్ మోసానికి తెలియకుండానే ప్రచారం కల్పించిన సెలబ్రిటీలకు సైబరాబాద్ పోలీసులు గతంలో నోటీసులు జారీ చేశారు.
పోలీసుల వార్నింగ్..
ఆ జాబితాలో అనిల్‌కపూర్, షారుఖ్‌ఖాన్, బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీష్రాఫ్, అల్లుశిరీష్, పూజాహెగ్డే, యువరాజ్ సింగ్ తదితరులు ఉండటం గమనార్హం. వారిలో కొంతమంది నోటీసులకు స్పందించి వారి న్యాయవాదుల ద్వారా సమాధానాలు ఇచ్చారు. సమాధానాలు ఇవ్వని సెలబ్రిటీలకు పోలీసులు రెండవసారి నోటీసులు జారీ చేశారు. వినియోగదారుల ఫోరం సవరణ చట్టం 1986 చట్టం ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్‌లు, ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వారిపై ఏడాది నుంచి మూడేళ్ల పాటు నిషేధం విధించవచ్చు. రూ.10 లక్షల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలుశిక్ష తప్పదని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన
ఖాద్రీ లక్ష్మీనారసింహుడి బ్రహ్మరథోత్సవం
రేషన్ కార్డులు కాదు.. పాపులర్ కార్డులు..
For More AP News and Telugu News