Hyderabad Private Travels: సిటీలోకి వచ్చేది లేదు.. ప్యాసింజర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ షాక్
ABN , Publish Date - Feb 12 , 2025 | 10:48 AM
గత 20 రోజుల నుంచి ఫిట్‌నెస్ లేకుండా, నిబంధనలు పాటించకుండా, తెలంగాణ ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీయే అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దాడులకు భయపడి బుధవారం తెల్లవారుజామున వనస్థలిపురం వద్దే బస్సులను నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్: నగరంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఆర్టీయే (RTA) అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో వనస్థలిపురం వద్ద బస్సులను (Buses) ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) నిలిపివేశారు. ఆర్టీఏ దాడులు పూర్తి అయ్యే వరకు నగరంలోకి బస్సులు తీసుకువెళ్లేది లేదని డ్రైవర్లు (Drivers) చెబుతున్నారు. దీంతో ప్రయాణీకులు (Passengers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కాల్ సెంటర్లకు (Call Centers) ఫోన్ చేస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ ప్రయాణీకులు వాపోయారు. గత 20 రోజుల నుంచి ఫిట్‌నెస్ లేకుండా, నిబంధనలు పాటించకుండా, తెలంగాణ ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీయే అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దాడులకు భయపడి వనస్థలిపురం వద్దే బస్సులను నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు దాదాపు 4, 5 గంటలు ఇబ్బందులు పడ్డారు.
ఈ వార్త కూడా చదవండి..
హైదరాబాద్ శివారులో క్యాసినో గుట్ఠు రట్టు..
ఆర్టీవో అధికారులు సోదాలు పూర్తి అయ్యే వరకు సిటీలోకి బస్సును తీసుకువెళ్లమని ఆరంజ్ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్ బస్సును వనస్థలిపురం వద్ద నిలిపివేశాడు. దీంతో ప్రయాణీకులు ఆరెంజ్ ట్రావెల్స్‌కు సంబంధించిన కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంటే ఆ బస్సులు ఫిట్‌నెస్ లేకపోవడం, సరైన పత్రాలు లేకుండా బస్సు నడుపుతున్నారు. ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేయడంతో వారు ఆందోళనకు దిగారు. ఆర్టీవో దాడులకు భయపడి కొన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వనస్థలిపురం వద్ద నిలిపివేశారు. అలాగే నిన్న, మొన్న రాజేంద్రనగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ 10 బస్సులకు పైగా ఆర్టీయే అధికారులు సీజ్ చేశారు.
కాగా నిబంధనలు పాటించకుండా ప్రయాణికుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులపై ఒక్కసారిగా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి, సీజ్ చేసిన ఘటన రాజేంద్రనగర్ లోని బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ కమిషనర్ సదానందం ఆదేశాల మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఆరంగార్ చౌరస్తా వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి, కిరణ్ కుమార్ రెడ్డి, వాసు, ఉపాసిని ఆర్టీఏ అధికారుల బృందం ఏకకాలంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలను పాటించకుండా బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకొని సీజ్ చేయడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఓవర్ లోడ్ తరలిస్తూ సెకండ్ డ్రైవర్ లేకుండా నడుపుతున్న బస్సులపై కూడా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సు నిర్వాహకులు ఎవరైనా టికెట్ చార్జింగ్ కన్నా ఎక్కువ వసూలు చేస్తే ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు
మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News