HYDRA: హైడ్రా గ్రీవెన్స్ ప్రారంభం.. ఫిర్యాదులు స్వీకరిస్తున్న రంగనాథ్
ABN, Publish Date - Jan 06 , 2025 | 11:43 AM
HYDRA: ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి హైడ్రా చీఫ్ ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి నిర్వాహణ ఉండనుంది. ఫిర్యాదుకు సంబంధిత ఆధారాలతో వస్తున్న ప్రజలు.. దాన్ని హైడ్రా చీఫ్‌కు అందజేస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 6: హైడ్రా గ్రీవెన్స్ ( Hydra Grievance) ప్రారంభమైంది. హైడ్రా (HYDRA) ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌లో సోమవారం ఉదయం హైడ్రా ప్రజావాణి మొదలైంది. హైడ్రా కమిషనర్ రంగానాథ్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి హైడ్రా చీఫ్ ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి నిర్వాహణ ఉండనుంది. ఫిర్యాదుకు సంబంధిత ఆధారాలతో వస్తున్న ప్రజలు.. దాన్ని హైడ్రా చీఫ్‌కు అందజేస్తున్నారు. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదుదారులకు అధికారులు టోకెన్స్ ఇచ్చారు. టోకెన్ ప్రకారం అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన అంటే పది రోజుల్లోపు పరిష్కరించేలా హైడ్రా నిర్ణయం తీసుకుంది. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టిసారించిన హైడ్రా.. న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఫిర్యాదులను పరిష్కరించాలని నిర్ణయించింది.
మరోవైపు ఎప్పటి నుంచో అనుకుంటున్న హైడ్రా పోలీస్‌స్టేషన్ కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. సంక్రాంతి పండుగకు హైడ్రా పోలీస్‌స్టేషన్ ప్రారంభంకానుంది. ఇప్పటికే హైడ్రా పీఎస్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. హైడ్రా పోలీస్‌స్టేసన్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇకపై హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా కూడా హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా హైడ్రా కమిషన్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా సేవలను అందుబాటులోకి రానున్నాయి.
ఇవి కూడా చదవండి...
TG NEWS: వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఏం జరిగిందంటే..
Hyderabad : లిఫ్ట్ ఇవ్వమని జాలిగా అడుగుతారు.. పోన్లే పాపమని ఇచ్చారో..
Read Latest Telangana News And Telugu news
Updated Date - Jan 06 , 2025 | 11:43 AM