ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: గర్ల్స్ హాస్టల్‌లో వీడియోలపై కొనసాగుతున్న విచారణ

ABN, Publish Date - Jan 03 , 2025 | 10:48 AM

Telangana: గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో వీడియోల ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే హాస్టల్ వార్డెన్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరోవైపు పలు ఫింగర్ ప్రింట్‌లను కూడా పోలీసులు సేకరించారు. ఫింగర్ ప్రింట్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

CMR Collage Girls Hostel

హైదరాబాద్, జనవరి 3: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీ (CMR Collage) ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఆగంతకులు తీశారని ఫిర్యాదు వచ్చాయి. ఇప్పటికే హాస్టల్ వార్డెన్‌తో సహా ఏడుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరోవైపు పలు ఫింగర్ ప్రింట్‌లను కూడా పోలీసులు సేకరించారు. ఫింగర్ ప్రింట్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆడపిల్లల వీడియోలు బయటకి పోతాయేమోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై మహిళా కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. ఫోరెన్సిక్ నుంచి వచ్చే రిపోర్ట్‌పైనే ఈ కేసు ఆధారపడి ఉంది. ఈ ఘటనతో మూడు రోజుల పాటు కాలేజ్ యాజమాన్యం సెలవులు ప్రకటించింది. దీంతో విద్యార్థినిలు అందరూ ఇళ్లకు వెళ్లిపోతున్నారు.


కాగా.. మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థినిలు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము స్నానం చేస్తుండగా వీడియోలు తీశారని.. బాత్ రూమ్‌లల్లో కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినిలు ఆందోళన బాట పట్టారు. గత రెండు రోజులుగా విద్యార్థినిలు నిరసనకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు విద్యార్థినిల ఆందోళనకు ఎన్ఎస్‌యూఐ నాయకులు మద్దతు తెలిపారు.

TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..


స్టూడెంట్స్‌ను కలిసి ఏం జరిగిందో తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కూడా సీఎంఆర్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస రెడ్డి అక్కడకు చేరుకుని విద్యార్థినిలతో మాట్లాడారు. ఆందోళనను విరమించాలని కోరారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనను విరమించేది లేదని విద్యార్థినులు స్పష్టం చేశారు. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాగా హాస్టల్ బాత్‌రూమ్‌లో సీసీ కెమెరాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.


ఇవి కూడా చదవండి...

అడ్డంగా దొరికేసిన సజ్జల..

నేటి నుంచి హైదరాబాదీలకు పండగే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 11:23 AM