IT Raids: హన్సిత, అనిల్ కేస్.. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు
ABN, Publish Date - Jan 08 , 2025 | 12:15 PM
Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. భువనేశ్వర్‌లో అరెస్ట్ అయిన హన్సిత , అనిల్ కుమార్ మహంతి కేసులో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ అల్లుడుగా చెప్పుకుంటూ హన్సిత, అనిల్ వసూళ్లకు పాల్పడ్డారు.
హైదరాబాద్, జనవరి 8: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో (Two Telugu States) ఐటీ సోదాలు (IT Raids) కలకలం రేపుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణలో సుమారు 12 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల తనిఖీలు జరుగుతుండగా.. ఆంధ్రాలో ఎనిమిది చోట్ల సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లతో మైన్స్ యజమానులకు చెందిన ఇళ్లల్లోనూ, కార్యాలయాల్లోనూ ఈ రైడ్స్ జరుగుతున్న ట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ బంటి, బబ్లీ కేసులో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. భువనేశ్వర్‌లో అరెస్ట్ అయిన హన్సిత , అనిల్ కుమార్ మహంతి కేసులో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రకు అల్లుడు, కూతురు అని చెప్పుకుంటూ హన్సిత, అనిల్ వసూళ్లకు పాల్పడ్డారు. మొత్తం 12 ప్రాంతాల నుంచి రూ.100 కోట్లకుపైగా వీరుఇద్దరు వసూళ్లకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుని వాడుకున్న హన్సిత, అనిల్.. ప్రభుత్వంలో పనులు చేయిస్తామంటూ పలు కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేశారు.
రెండు రోజుల క్రితం భువనేశ్వర్‌లో హన్సిత, అనిల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా వీరి నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. హన్సిత, అనిల్ ఇచ్చిన సమాచారంతో 12 ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేపడుతోంది. హైదరాబాద్, ఆంధ్ర, భువనేశ్వర్, ఢిల్లీ, ఝార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. వసూళ్లు చేసిన డబ్బులతో హన్సిత, అనిల్ లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. లగ్జరీ కార్లు , అధునాతన విల్లాలతో పాటు లైఫ్‌ను ఎంజాయ్ చేశారు హన్సిత, అనిల్. ఇన్కమ్ టాక్స్ లేకుండా చేస్తానంటూ కంపెనీల నుంచి వసూల్లో పాల్పడ్డారు వీరిద్దరు. టాక్స్ ఎగ్గొట్టేందుకు హన్సిత, అనిల్‌లకు కంపెనీలు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఈ ఇద్దరికి ముడుపులు ముట్టజెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఎవరెవరైతే ఈ జంటకు లంచాలో అప్పజెప్పారో వారి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Harish Rao: కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి మరో నిదర్శనం
కాగా.. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూతురు, అల్లుడినంటూ హన్సిత, అనిల్‌ను భారీగా డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు. ముఖ్యంగా మైనింగ్, నిర్మాణ రంగాల్లో ఉన్న ధనవంతులను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ టెండర్లు ఇప్పిస్తామని నమ్మించేవారు. అందుకు సంబంధించిన ఫోటోలు, ఫేక్ సంబంధాలను చూపించి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేశారు. ఈ క్రమంలో మోసానికి గురైన ఓ గనుల వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో రీయల్ బంటి, బబ్లీ కేసు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన భువనేశ్వర పోలీసులు దర్యాప్తు చేపట్టగా... ఈ దంపతులకు సంబంధించి అనేక విషయాలు బయటపడ్డాయి. చాలా మంది వద్ద నుంచి కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆధారాలు లభించాయి. వీరి భారిన పడి మోసపోయిన వారు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్న పోలీసులు కోరారు.
ఇవి కూడా చదవండి...
కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 08 , 2025 | 12:24 PM