ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. మరోసారి హైకోర్టు మెట్లు ఎక్కనున్న కేటీఆర్..

ABN, Publish Date - Jan 07 , 2025 | 09:44 PM

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ హైకోర్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆశ్రయించనున్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో న్యాయవాది సమక్షంలోనే తనను విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు కేటీఆర్ రేపు(గురువారం) వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

BRS Working President KTR

హైదారాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula-E car race) కేసులో తెలంగాణ హైకోర్టు(High Court)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి ఆశ్రయించనున్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో న్యాయవాది సమక్షంలోనే తనను విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు కేటీఆర్ రేపు(గురువారం) వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ (ACB) అధికారులు విచారణ చేసే సమయంలో తనతోపాటు న్యాయవాదిని అనుమతించేలా వారికి డైరెక్షన్స్ ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు.

Allu Arjun: ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్‌ రియాక్షన్ ఇదే..


కాగా, ఈనెల 6న విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో కేటీఆర్ తన లాయర్లతో కలిసి నిన్న (సోమవారం) బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అయితే న్యాయవాదులను ఏసీబీ కార్యాలయం లోపలకి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో అక్కడంతా హైడ్రామా చోటు చేసుకుంది. లాయర్లతో కలిసి విచారణకు అనుమతించలేమని అధికారులు తేల్చి చెప్పడంతో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాదాపు 40 నిమిషాలపాటు కార్యాలయం ఎదుట కారులోనే కేటీఆర్ ఉండిపోయారు. చివరికి చేసేదేమీ లేక తాను చెప్పదలచుకున్న విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసిన కేటీఆర్.. ఆ లేఖను ఏసీబీ అధికారులకు అందజేసి విచారణకు హాజరు కాకుండానే వెళ్లిపోయారు.

KTR: ‘నా మాట గుర్తుంచుకో’.. కేటీఆర్ సంచలన ట్వీట్..


అయితే ఈనెల 9న విచారణకు హాజరుకావాలని ఏసీబీ, ఈనెల 16 విచారణకు రావాలని ఈడీ కేటీఆర్‌కు మళ్లీ నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే న్యాయవాదులతో కలిసి విచారణకు వెళ్లేందుకు అనుతించాలని హైకోర్టుకు కేటీఆర్ ఆశ్రయించారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే తన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంపైనా సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Formula E Case: కేటీఆర్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. మరోసారి నోటీసులు

KTR: కేటీఆర్ కేసులో హైకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు

Updated Date - Jan 07 , 2025 | 09:50 PM