Lulu Manjeera Mall: లులూ చేతికి కూకట్‌పల్లి మంజీరా మాల్
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:02 PM
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉన్న మంజీరా మాల్‌ను ఇంతకాలం అద్దెకు తీసుకుని నడుపుతున్న లులూ యాజమాన్యం ఇప్పుడు మంజీరా మాల్ ను వేలంపాటలో రూ.319.42 కోట్లకు స్వాధీనం చేసుకుంది.

Kukatpalli Lulu Manjeera Mall: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని మంజీరా మాల్ చాలా మందికి తెలిసిందే కదా. ఇప్పుడు అది లులూ వశమైంది. ఇంతకాలం మంజీరామాల్ ను అద్దెకు తీసుకుని నడుపుతున్న లులూ యాజమాన్యం ఇప్పుడు మంజీరా మాల్ ను వేలంపాటలో రూ.319.42 కోట్లకు స్వాధీనం చేసుకుంది. మంజీరామాల్ యాజమాన్య సంస్థ అయిన మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్‌ను.. NCLT (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) ఏప్రిల్ 10, 2025న నిర్వహించిన దివాలా వేలంపాటలో లులూ ఇంటర్నేషనల్ షాపింగ్స్ మాల్స్ సొంతం చేసుకుంది.
ఈ మాల్ కోసం మొత్తం 49 సంస్థలు పోటీ పడగా, ₹317.30 కోట్ల బకాయిలు ఉన్న మంజీరా మాల్‌ను ₹318.42 కోట్లతో పరిష్కార ప్రణాళికను అందించిన లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు క్రెడిటర్ల కమిటీ (COC)తోపాటు, NCLT(నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) ఆమోదం తెలిపింది. కేటలిస్ట్ ట్రస్టీషిప్ లిమిటెడ్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (COC)లో ఉన్నాయి.
మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ తమ వద్ద తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో కేటలిస్ట్ ట్రస్టీషిప్ గత ఏడాది జులైలో ఎన్‌సీఎల్‌టీ(NCLT)ని ఆశ్రయించింది. దీన్ని NCLT అనుమతించడంతో పాటు దివాలా ప్రక్రియ నిర్వహించడానికి బీరేంద్ర కుమార్ అగర్వాల్‌ను రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా నియమించింది. దీంతో బిడ్లు పిలవడం, ఆసక్తి గల సంస్థలతో సంప్రదింపులు సాగించడం, సీఓసీ సమావేశాలు నిర్వహించడం వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేశారు. ఈ దశలన్నీ అధిగమించి లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్, మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు