Share News

Mastan Sai: వీడు మాములోడు కాదు.. నగ్నంగా వీడియోలు తీసి ఏం చేశాడంటే.. మస్తాన్‌సాయి ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే నిజాలు

ABN , Publish Date - Feb 05 , 2025 | 03:04 PM

Mastan Sai: నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయి గురించి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితులతో కలిసి డ్రగ్స్, గంజాయి పార్టీలు చేసుకున్న మస్తాన్ సాయి.. మత్తులోకి జారుకున్న అమ్మాయిల పట్ల లైంగికంగా దాడికి పాల్పడేవాడని పోలీసుల విచారణలో బయటపడింది.

Mastan Sai: వీడు మాములోడు కాదు.. నగ్నంగా వీడియోలు తీసి  ఏం చేశాడంటే.. మస్తాన్‌సాయి ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే నిజాలు
Mastan Sai Case

హైదరాబాద్, ఫిబ్రవరి 5: నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయి (Mastan Sai Case) ఆగడాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. అమ్మాయిలతో ప్రైవేట్‌గా గడిపిన సమయంలో వీడియోలు తీసి పోర్న్ సైట్‌లలో అప్లోడ్ చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీల వీడియోలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. తన స్నేహితులతో కలిసి డ్రగ్స్, గంజాయి పార్టీలు చేసుకున్నాడు మస్తాన్ సాయి. శని, ఆదివారాల్లో మస్తాన్ సాయి విల్లాలో భారీగా డ్రగ్స్ పార్టీలు జరిగేవని పోలీసుల విచారణలో బయటపడింది. డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలోనే మస్తాన్ సాయి వీడియోలు రికార్డ్ చేసినట్లు గుర్తించారు. అమ్మాయిలు గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వీడియోలు కూడా హార్డ్ డిస్క్‌లో గుర్తించారు కాప్స్. మత్తులోకి జారుకున్న తరువాత అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడేవాడు మస్తాన్. మస్తాన్ సాయి సెల్ ఫోన్, హార్డ్ డిస్క్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు పోలీసులు.


మరోవైపు మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్ సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసిన మస్తాన్ సాయిపై ఎన్‌డీపీఎస్‌ సెక్షన్‌‌ను కూడా పోలీసులు జోడించారు. మస్తాన్ సాయి , లావణ్య మధ్య గతంలోనే హీరో రాజ్‌ తరుణ్ సయోధ్య కుదిర్చారు. మస్తాన్ సాయి లాప్ టాప్‌లో ఉన్న లావణ్య వీడియోలను గతంలోనే డిలీట్ చేపించాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ డిలీట్ చేయించే లోపే ఇతర డివైజేస్‌లోకి వీడియోస్ కాపీ చేసుకున్నాడు మస్తాన్ సాయి. లావణ్యను పలు మార్లు చంపేందుకు ప్రయత్నించాడు మస్తాన్ సాయి. హార్డ్ డిస్క్ కోసం లావణ్యను చంపాలని ప్లాన్ చేశాడు.

వివేకా కేసు.. కీలక వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్


జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లి లావణ్యపై హత్యాయత్నం చేశాడు. అక్టోబర్ 2022 లో తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించిన మస్తాన్ సాయి.. లావణ్య డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా సీక్రెట్ సీసీ కెమెరాలో వీడియోలు రికార్డు చేశాడు. నవంబర్‌లో మరో పార్టీలో లావణ్యకు డ్రగ్స్, మద్యం తాగించాడు మస్తాన్. మత్తులో ఉన్న లావణ్య ప్రైవేట్ వీడియోస్ తీశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పడంతో లావణ్య , మస్తాన్ మధ్య విభేదాలు తలెత్తాయి. పోలీసులకు విషయం చెబితే , వీడియోను సోషల్ మీడియాలో పెడుతా అని మస్తాన్ సాయి బెదిరింపులకు దిగినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

BRS: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఆ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

మరింత పెరిగిన బంగారం ధరలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 05 , 2025 | 03:05 PM