TG News : కొత్త రేషన్ కార్డుల కోసం మార్గదర్శకాలు విడుదల
ABN, Publish Date - Jan 13 , 2025 | 09:24 PM
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే కుల గణన సర్వే పూర్తయింది. ఈ నేపథ్యంలో జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేరి చేయనుంది.
హైదరాబాద్, జనవరి 13: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. అందులోభాగంగా ఇప్పటికే పలు హామీలను అమలు చేసింది. తాజాగా సంక్రాంతి పండగ వేళ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
కుల గణన (SEEEPC) సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం పంపబడుతుందని తెలిపింది. మండల స్థాయిలో ఎంపిడిఓతోపాటు యూఎల్‍బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లేదా జీసీఎస్ఓ పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు.
ముసాయిదా జాబితాను గ్రామసభతోపాటు వార్డు సభలో ప్రదర్శించి.. చదివి వినిపించి.. అనంతరం చర్చించిన తరువాత ఆమోదిస్తారు. అలాగే గ్రామసభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్దిదారుల అర్హత జాబితాను మండల లేకుంటే మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్ లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ లేదా జీహెచ్ఎంసీ కమీషనర్ లాగిన్‍కు పంపాలని తెలిపింది.
ఆ విధంగా పంపిన జాబితాను జిల్లా కలెక్టర్ లేదా జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్(CCS) లాగిన్‍కి పంపాల్సి ఉంటుంది. తుది జాబితా ప్రకారం.. సీసీఎస్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. ఆ క్రమంలో అర్హత కలిగిన వారికి.. ఒకే ఒక్క ఆహార భద్రత (రేషన్) కార్డులో పేర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆహార భద్రత (రేషన్) కార్డులలో కుటుంబ సభ్యుల మార్పులు.. చేర్పులు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు.. పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కీలక సూచన
Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
Also Read: మహా కుంభమేళలో విగ్రహం కారణంగా రేగిన వివాదం
Also Read: ఛీ ఛీ అనిపించుకోను
Also Read: నెలకు రూ. 20 వేలు పెన్షన్.. శుభవార్త చెప్పిన సీఎం
Also Read: కోడి పందాల్లో గెలవాలంటే.. ఇలా చేయండి
Also Read: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?
For Telangana News And Telugu News
Updated Date - Jan 13 , 2025 | 09:47 PM