Haleem in Numaish: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. నుమాయిష్‌లో హలీం రెడీ.. ప్లేట్ ధర ఎంతంటే..
ABN, Publish Date - Jan 03 , 2025 | 10:06 PM
Haleem in Numaish: రంజాన్ మాసం ప్రారంభ కాకుండానే.. హైదరాబాద్‌లో హలీం.. లభ్యమవుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభమైంది. నుమాయిష్‌లో హలీం విక్రయాలు జరగనుంది.
హైదరాబాద్, జనవరి 03: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఇటీవల పుస్తక పండగ జరిగింది. దీంతో పుస్తక ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇవి ఇటీవల ముగిశాయి. తాజాగా జనవరి 3వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. దీనినే నుమాయిష్ అని కూడా అంటారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ నుమాయిష్ కొనసాగనుంది. ఈ నుమాయిష్‌లో అన్ని రకాల షాపులు దర్శనమిస్తాయి. ఈ నుమాయిష్.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ పేరు చెప్పాగానే..బిర్యానీ గుర్తుకు వస్తుంది. అలాగే హలీమ్ సైతం గుర్తుకు వస్తుంది.
నుమాయిష్‌లోని అన్ని ఫుడ్ స్టాల్స్‌లో... పిస్తా హౌస్ నిత్యం నాణ్యమైన పదార్ధాలను తయారు చేసిన ఆహారాన్ని అందుబాటులో ఉంచుతోంది. రుచికరమైన ఆహార పదార్థాలతో స్థానికులనే కాదు.. పర్యాటకులను సైతం ఆకర్షిస్తుంది. దీంతో హలీమ్ ధరలు బాగా పెరిగాయంటూ ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. దీనిపై పిస్తా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ మొహ్సీ ఓ స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది హలీమ్ ప్లేట్ ధర రూ.300గా నిర్ణయించామని తెలిపారు.
ఇక ఫ్యామిలీ ప్యాక్ ధర రూ.1,200. అలాగే ఈ ఏడాది ప్రీమియం హాట్‌పాట్ హలీమ్‌ను తిరిగి తీసుకు వస్తోందన్నారు. దీనిని గత ఏడాది తొలిసారిగా ప్రవేశ పెట్టామని వివరించారు. ఈ హాట్‌పాట్ హలీమ్ ధర రూ.1,350గా నిర్ణయించినట్లు చెప్పారు. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు విపరీతంగా పెరిగాయని గుర్తు చేశారు. అలాగే సిబ్బంది జీతభత్యాల పెంపు కారణంగా.. తాము ఈ ధరను కాస్తా పెంచవలసి వచ్చిందని ఆయన సోదాహరణగా వివరించారు.
వీటిని పరిగణనలోకి తీసుకొని.. ఈ ఏడాది ఒక్కో ప్లేట్ హలీం ధర రూ.300గా నిర్ణయించామని మోహ్సీ పేర్కొన్నారు. అయితే నుమాయిష్ శుక్రవారం నుంచి ప్రారంభమైనా.. పిస్తా హౌస్ మాత్రం హలీమ్ స్టాల్‌లో జనవరి 4వ తేదీ నుంచి సేవలు ప్రారంభిస్తోందని ఎండీ మహమ్మద్ అబ్దుల్ మొహ్సీ తెలిపారు. ఎప్పటిలాగే తాము తయారు చేసే.. హలీమ్ రుచి, సువాసనలతో సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నుమాయిష్ ప్రారంభమైన కొద్ది సేపటికే తమ వద్ద హలీమ్ విక్రయాలు ఊపందుకొని.. ఆ వెంటనే అయిపోతాయని వివరించారు. అసలు అయితే రంజాన్ మాసంలో హలీమ్ తయారు చేస్తారు. కానీ నుమాయిష్ ప్రారంభంతోనే హలీమ్.. స్థానికులతోపాటు పర్యాటకుల చేతిలోకి వచ్చి చేరుతోంది.
For Telangana News And Telugu News
మరిన్నీ తెలుగు వార్తలు..
Also Read: మరో వైరస్ కలకలం.. రోగులతో చైనా ఆసుపత్రులు కిటకిట.. భారత్ అలర్ట్
Also Read: మళ్లీ లండన్ ప్రయాణం.. కోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్
Also Read: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం..
Also Read: జేసీ ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్
Also Read: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా?
Also Read: ప్రశాంత్ కిషోర్‌కి పెరుగుతోన్న మద్దతు
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్
Updated Date - Jan 03 , 2025 | 10:15 PM