ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN, Publish Date - Jan 06 , 2025 | 01:47 PM

హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌‌ను సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చ్యువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరవుతున్నారు.

హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ (Cherlapalli Railway Terminal)ను సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చ్యువల్‌ (Virtual)గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగిందని, రూ.413 కోట్ల వ్యయంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఓఆర్ఆర్‌కు అత్యంత సమీపంలో చర్లపల్లి ఉందని, తెలంగాణ ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతోందని, సోలార్ స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేశారని మోదీ వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా.. చర్లపల్లి లాంటి స్టేషన్లు ఎంతో అవసరమని, 2014లో కేవలం 5 నగరాల్లోనే మెట్రో ఉందని, పదేళ్లలో 21 నగరాలకు మెట్రో విస్తరించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


భారత రైల్వేలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నామని, కోట్లాది మందిని వందేభారత్ రైళ్లు గమ్యం చేరుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో 35 శాతం విద్యుదీకరణ పూర్తయిందని, వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు తెచ్చామని, హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు. 180 కి.మీ. వేగంతో వందేభారత్ స్లీపర్ కోచ్ రైలు ట్రయల్ రన్ పూర్తి అయిందన్నారు. త్వరలోనే బుల్లెట్ రైలు సాకారం అవుతుందని, పదేళ్లలో 30 వేల కి.మీ. రైల్వే లైన్లు నిర్మించామని అన్నారు. నాలుగు విభాగాలుగా రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామని, మౌలిక వసతులు, ప్రయాణికుల సదుపాయాలు, మూరుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ, ఉపాధి కల్పనే తమ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, ఒడిషా, తెలంగాణలో.. కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని, రైల్వే ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఈ కార్యక్రమంలో వర్చ్యువల్‌గా పాల్గొన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరయ్యారు. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గించి, నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు నాల్గో టెర్మినల్‌గా చర్లపల్లి రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆరున్నరేళ్ల కాల వ్యవధిలో దాదాపు రూ.428 కోట్లతో నిర్మితమైన ఈ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది.


కాగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర మంత్రులు జి.కిషన్‌ రెడ్డి, వి.సోమన్న, రవనీత్‌ సింగ్‌, బండి సంజయ్‌, గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, తదితరులు హాజరయ్యారు. కాగా ఈ నెల7వ తేదీ నుంచి సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ (12757-12758), గుంటూరు- సికింద్రాబాద్‌- గుంటూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17201-17202), సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌(17233-17234) రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాపేజ్‌ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ వెళ్లి వచ్చే రైళ్లు (12603-12604) మార్చి 7 నుంచి,. గోరఖ్‌పూర్‌- సికింద్రాబాద్‌ వెళ్లి వచ్చే రైళ్లు (12589-12590) మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్‌ నుంచే రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.

Updated Date - Jan 06 , 2025 | 01:56 PM