Preity Zinta: తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్‌కి ప్రీతిజింటా..
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:14 PM
Preity Zinta: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతిజింటా తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజలు చేశారు.

సికింద్రాబాద్, ఏప్రిల్ 12: హనుమాన్ జయంతిని (Hanuman Jayanti) పురస్కరించుకుని ఊరూవాడా వీరహనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వేలాది మంది భక్త జనసందోహం నడుమ హనుమాన్ శోభాయాత్ర కన్నులపండువగా సాగుతోంది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర సాగనుంది. ఇదిలా ఉండగా.. హనుమాన్ జయంతి సందర్భంగా పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా (preity zinta) తాడ్‌బండ్ వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈరోజు (శనివారం) ఉదయం తాడ్‌బండ్ హనుమాన్ ఆలయానికి వచ్చిన ప్రీతి జింటా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి సాయంత్రం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలబడనుంది. ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్ విజయాన్ని కోరుతూ ప్రీతిజింటా వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
కాగా.. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపబడనుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు అత్యంత కీలకమని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆడిన ఐదు ఆటల్లో వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ ఓటమి బాటపట్టిన విషయం తెలిసిందే. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ టీం గెలుపొందింది. దీంతో ఈ మ్యాచ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్‌రైజర్స్.. ఇందులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పకుండా గెలిచి తీరాల్సిందే. ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ కూడా సన్‌రైజర్స్‌కు అత్యంత కీలకమే.
ఇక పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే... గత మ్యాచ్‌లో చైన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించిన ఈ టీం.. ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కూడా ఓ పట్టుపట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ టీమ్ కో-ఓనర్ ప్రీతి జింటా తాడ్‌బండ్ హనుమంతుడి ఆలయాన్ని సందర్శించడం, ఆంజనేయుడి ఆశీస్సులు తీసుకోవడం చర్చనీయాంశంగా మరింది. హనుమాన్ జయంతి నేపథ్యంలోనే ఆమె టెంపుల్‌కు వచ్చినా.. ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ కోసం ఇంకా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈసారైనా అది దక్కేలా చేయమంటూ బజరంగబలిని కోరుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Inter Results Top Districts: ఇంటర్ ఫలితాల్లో టాప్‌లో నిలిచిన జిల్లాలు ఇవే
Inter Supplementary Exams: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపుకు తుది గడువు ఇదే
Read Latest Telangana News And Telugu News