ED: గొర్రెల పంపిణీ స్కామ్ కేసు.. విచారణ వేగవంతం..
ABN , Publish Date - Apr 16 , 2025 | 08:22 AM
గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలను మనీ లాండరింగ్ కేసుగా ఈడీ విచారణ చేపట్టింది. బుధవారం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బుధవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు తెప్పించుకున్నారు.

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ (BRS Government) హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ (Sheep Distribution) కేసు (Case)లో మళ్లీ కదలిక వచ్చింది. కేసులో విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) వేగవంతం చేసింది. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బుధవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. గొర్రెల స్కీమ్‌లో రూ. 700 కోట్లు అవినీతి (Rs. 700 crore corruption) జరిగిందంటూ ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. గతంలోనే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. కాగా ఇవాళ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను అధికారులు విచారించనున్నారు. గొర్రెల పంపిణీ విధివిధానాలతో పాటు ప్రభుత్వ నిధుల చెల్లింపునకు సంబంధించిన వివరాలను సేకరించనున్నారు.
Also Read..: ఏపీలో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటన
గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలను మనీ లాండరింగ్ కేసుగా ఈడీ విచారణకు స్వీకరించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. గొర్రెల కొనుగోళ్ల పేరిట రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో పెద్దఎత్తున డబ్బు చేతులు మారడం, ఇతర రాష్ట్రాలకూ లింకు ఉండడంతో ఈడీ రంగంలోకి దిగింది. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం లేఖ రాసింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు, అడ్రస్, కాంటాక్ట్ సెల్ నంబర్లు, బ్యాంకు ఖాతా నంబరు, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు తదితర వివరాలను ఇవ్వాలని కోరింది. జిల్లాలవారీగా లబ్ధిదారులకు గొర్రెలు అమ్మిన యజమానుల పూర్తి వివరాలు కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఏ బ్యాంకు ఖాతా నుంచి నిధులు బదిలీ చేశారు.. బ్యాంకు- బ్రాంచి వివరాలు ఏమిటి.. జిల్లాలవారీగా లబ్ధిదారులు తమ వాటా ధనాన్ని ఏ బ్యాంకు ఖాతా నుంచి ఏ బ్యాంకు ఖాతాకు జమ చేశారు.. ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలు, రవాణా చేసిన వాహనాలు, గొర్రెల యూనిట్ల వివరాలు కూడా ఇవ్వాలని కోరింది.
కాగా హైదరబాద్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి మరో సారి ఈడీ సోదాలు చేపట్టింది. నాలుగు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. సురానా ఇండస్ట్రీస్‌తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ, ఎండీ నివాసంపై ఈడి సోదాలు చేస్తోంది. చెన్నైకు చెందిన ఈడీ బృందాలు సోదాలు చేస్తోంది. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి సురానా ఇండస్ట్రీస్ వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఇప్పటికే సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.దీనికి అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ ఉంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ
మన చంద్రన్న పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం
For More AP News and Telugu News