Share News

CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:44 PM

CM Revanth Praised Women: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ సందర్భంగా సన్న బియ్యం తీసుకున్న సిద్ధిపేట మహిళ చేసిన పనిని చూసి సీఎం రేవంత్ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు
CM Revanth Praised Women:

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది కాంగ్రెస్ సర్కార్ (Congress Govt). రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కూడా కాంగ్రెస్ హామీల్లో ఒకటి. ఇచ్చిన హామీ మేరకు ఉగాది కానుకగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొదలుపెట్టారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులకు వస్తున్న దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తోంది. ప్రతీ రేషన్‌కార్డుదారునికి ఆరు కిలోల చెప్పున్న సన్న బియ్యాన్ని ఇస్తున్నారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం రావడంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలా ఉండగా.. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు కూడా రేషన్‌కార్డు ద్వారా సన్న బియ్యం వచ్చింది. దీంతో ఎంతో ఆనందం వ్యక్తం చేసిన ఆ మహిళ.. తన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఆమె చేసిన ఓ పనితో స్వయంగా ముఖ్యమంత్రి అభినందలను పొందింది. ఇంతకీ సిద్దిపేట మహిళ ఏం చేసింది... సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Anna Lezhneva Donation: కుమారుడి పేరుపై అన్నా కొణిదెల భారీ విరాళం


ఇదీ సంగతి

సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళకు రేషన్‌కార్డు ద్వారా 24 కిలోల సన్నబియ్యం వచ్చింది. ఇన్ని రోజులుగా దొడ్డు బియ్యం వస్తుండగా.. ఇప్పుడు సన్న బియ్యం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా తనకు వచ్చిన 24 కిలోల సన్న బియ్యంతో ఊరందిరినీ పిలిచి సహపంక్తి భోజనం పెట్టింది. దీంతో ఆ ఊరి ప్రజలు కూడా సన్న బియ్యంతో వండిన భోజనాన్ని కడుపారా తిన్నారు. పండగ వాతావరణంలో కూతురి లక్ష్మీ ఇంటిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు సహపంక్తి భోజనాలు చేశారు. సన్న బియ్యంతో పేదల కడుపు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున 125 మందికి భోజనాలు పెట్టిన లక్ష్మికి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ చీరను బహుకరించారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. దీంతో లక్ష్మీని అభినందించారు సీఎం. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు సీఎం రేవంత్.


రేవంత్ ట్వీట్ ఇదే

‘సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట గ్రామానికి చెందిన కూతురి లక్ష్మీకి నా ప్రత్యేక అభినందనలు. తనకు వచ్చిన 24 కిలోల సన్న బియ్యంతో ఆమె ఊరందరికి సహపంక్తి భోజనం పెట్టి, ఈ పథకం పేదల జీవితాల్లో ఎంతటి ఆనందాన్ని నింపిందో చెప్పే ప్రయత్నం చేసింది. సన్నబియ్యం లబ్ధిదారులే మా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు’ అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా లక్ష్మీ చేసిన పనికి నెటిజన్లు కూడా ఆమెను అభినందిస్తున్నారు.


కాగా.. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక గత ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి 24 లక్షల టన్నుల సన్న వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ కూడా ఇచ్చింది. రైతుల నుంచి తీసుకున్న సన్న వడ్లను మిల్లింగ్ చేయించి ఆ బియ్యాన్ని ఉగాది పర్వదినం నుంచి రేషన్‌కార్డు ద్వారా పేదలకు పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులతో కలిపి 91.19 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ పథకం ద్వారా దాదాపు 2.82 కోట్ల మంది లబ్ధిపొందనున్నారు.


ఇవి కూడా చదవండి

Monday Tips: సోమవారం ఈ పరిహారాలు చేస్తే చంద్ర దోషం నుండి విముక్తి..

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 01:26 PM