Command Control Centre: సీసీసీ సెంటర్లోకి గుర్తుతెలియని వ్యక్తి.. పోలీసుల సీరియస్

ABN, Publish Date - Feb 19 , 2025 | 10:01 AM

Telangana: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌నంటూ ఓ వ్యక్తి సంచరించడం హాట్‌టాపిక్‌ మారింది. సీఎం సమీక్షలు చేస్తున్న సమయంలోనే ఆ వ్యక్తి సీసీసీ సెంటర్‌లోకి వచ్చి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు.

Command Control Centre: సీసీసీ సెంటర్లోకి గుర్తుతెలియని వ్యక్తి.. పోలీసుల సీరియస్
Command And Control Centre

హైదరాబాద్, ఫిబ్రవరి 19: బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి (సీసీసీ) (Command And Control Centre Telangana Police) గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే సీసీసీ సెంటర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ప్రచారం చేసుకుంటూ సదరు వ్యక్తి సీసీసీ సెంటర్‌లో సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ ఫేక్ ఉద్యోగి జ్ఞాన సాయి ప్రసాద్‌గా విచారణలో బయటపడింది.


జ్ఞాన సాయి ప్రసాద్ సీసీసీ సెంటర్ ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వ్యాపార లావాదేవీల పేరుతో గోవర్ధన్ అనే వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. గోవర్ధన్ నుంచి జ్ఞాన స్థాయి ప్రసాద్ మూడు లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వెళ్లడాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. జ్ఞాన సాయి ప్రసాద్‌ వెళ్లిన హోటల్‌తో పాటు సీసీసీలోని సీసీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు సేకరించారు.


ఇవి కూడా చదవండి..

జగన్ గుంటూరు పర్యటనపై సందిగ్థత...

ఛాంపియన్స్ మహా సమరం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 19 , 2025 | 11:10 AM