TG News: కేక్ తింటున్నారా.. జాగ్రత్తండోయ్
ABN, Publish Date - Jan 04 , 2025 | 03:02 PM
Telangana: బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బేకరీలో కనిపించిన దృశ్యాలను చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్‌కు గురయ్యారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ప్లమ్ కేకుల తయారీలో ఉపయోగించే వాటిని చూసి అధికారులు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.
హైదరాబాద్, జనవరి 4: కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా ఉంది వ్యాపారుల నిర్వాకం. ఎక్కువ డబ్బులు సంపాందించేందుకు ప్రజల ఆరోగ్యాలనే పణంగా పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీనే.. ఏదీ తిందామన్న కల్తీనే. డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న వ్యాపారులు.. నాణ్యత విషయంలో మాత్రం ప్రమాణాలు పాటించని పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్ బిర్యానీ ఇమేజ్‌ను దెబ్బ తీశారు. బిర్యానీ తయారీ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బిర్యానీలో బొద్దింకలు, సిగరెట్ పీకలు వంటివి బయటబట్టాయి. దీంతో హైదరాబాద్ బిర్యానీ ఇమేజ్ భారీగా దెబ్బతింది. అలాగే మిగిలిన ఫుడ్ విషయాల్లోనూ వ్యాపారస్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనేక రెస్ట్రారెంట్లు, హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి.. నాణ్యతా ప్రమాణాలు పాటించిన వాటిని సీజ్ చేయడంతో పాటు పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ వ్యాపారుల్లో మాత్రం చలనం రావడం లేదు. తాజాగా బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బేకరీలో కనిపించిన దృశ్యాలను చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్‌కు గురయ్యారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ప్లమ్ కేకుల తయారీలో ఉపయోగించే వాటిని చూసి అధికారులు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. మరీ ఇంత దారుణంగా ఉంటుందా అని ఫుడ్ సేఫ్టీ అధికారులే ఆశ్చర్యయేలా ప్రవర్తించారు బేకరీ నిర్వాహకులు. ఇంతకీ ప్లమ్‌లో కేక్‌ల తయారీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసినవి ఏంటి.. అక్కడ బయటపడ్డ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నగరంలోని కార్ఖానాలోని వాక్స్ బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అధికారుల తనిఖీల్లో బేకరీలోని బాగోతం బట్టబయలైంది. కార్ఖానాలోని వాక్స్ పెస్ట్రీస్ బేకరి నిర్వాహకులు.. ఓల్డ్ మాంక్ రమ్‌తో ఫ్లమ్ కేక్స్ తయారు చేస్తున్న దృశ్యాలు అధికారుల కంట్లో పడింది. న్యూ ఇయర్ సందర్భంగా కేక్స్ టేస్ట్ కోసం మద్యం కలిపినట్లు గుర్తించారు. ప్లమ్ కేక్స్ తయారీలో రమ్ ఉపయోగించేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి కూడా లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కేక్‌ల తయారీలో రమ్ మద్యం వాడుతున్నట్లు చూపకుండా అమ్మకాలు జరిపారు బేకరీ నిర్వాహకులు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో కేక్‌లు తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ప్లాస్టిక్ డ్రమ్ములో అపరిశుభ్రంగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే కేక్‌ల తయారీలో ఇతర కెమికల్స్ కూడా వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. కేక్‌ల తయారీ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బేకరీ నిర్వహకులపై చర్యలు తీసుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
బొద్దింకలు.. ఎలుకల మధ్యే
మరోవైపు అల్వాల్ మచ్చ బొల్లారం మోంగినిస్ బేకరీలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. బొద్దింకలు, ఎలుకల మధ్య కేక్‌లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లుగా అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఎక్స్‌పైర్ అయిన కోకోనట్ పౌడర్, కేసర్ సిరప్, వెనీలా ఫ్లేవర్ సిరప్, పైన్ యాపిల్ సిరప్‌లను అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్‌లు, ప్లాస్టిక్ డ్రమ్స్‌లో కేక్‌లను తయారు చేస్తున్నారు నిర్వాహకులు. అపరిశుభ్ర వాతావరణంలో కేక్‌లను తయారు చేస్తున్న బేకరి నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
నాలుగో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు..
అత్యవసర ల్యాండింగైన ఇండిగో విమానం.. విషయం ఇదే..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 04 , 2025 | 03:07 PM