Hyderabad crime news: పనిలో చేరిన 16 గంటల్లో ఊహించని షాకిచ్చిన మహిళ
ABN, Publish Date - Mar 18 , 2025 | 10:23 AM
Hyderabad crime news: వైజాగ్‌కు చెందిన మహిళ పనికోసమని హైదరాబాద్‌కు వచ్చింది. పనిలో చేరిన తర్వాత సదరు మహిళ.. యజమానులకు ఊహించని షాకిచ్చింది.

హైదరాబాద్, మార్చి 18: ఏపీకి చెందిన ఓ మహిళ పని కోసం వెతుకుతోంది. చాలా చోట్ల పని కోసం తిరిగింది. ఎక్కడా పని దొరకలేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తన బాధను ఆయనకు చెప్పుకోగా.. మానవత్వంతో ఆలోచించిన సదరు వ్యక్తి.. ఆ మహిళకు సహాయం చేయాలనుకున్నాడు. కానీ అదే అతడి కొంప ముంచుతుందని ఊహించలేకపోయాడు. మహిళకు పని చూపించాడు ఆ వ్యక్తి. ఎంతో నమ్మకంగా పనిలో చేరిన ఆ మహిళ.. యాజమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ మహిళ ఏం చేసింది.. యజమానికి ఎలాంటి షాక్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్‌కు చెందిన శ్రీదేవి అనే మహిళ హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో పనికి కుదిరింది. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ చకచకగా పనులు చేసింది. ఆ ఇంట్లోని వాళ్లు మహిళను ఎంతో నమ్మారు కూడా. కానీ పనిలో చేరిన 16 గంటల్లోనే ఆ మహిళ చేసిన పనికి అవాక్కవడం యాజమాని వంతైంది. పనిలో చేరిన 16 గంటల్లోనే ఇంట్లో చోరీకి పాల్పడి పరారైంది ఆ కిలాడీ లేడీ. నగరంలోని బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైజాగ్‌కు చెందిన సత్యనారాయణకు నిందితురాలు శ్రీదేవి పరిచయమైంది. పని కోసం వెతుక్కుంటున్నానని చెప్పడంతో తన కుమార్తె ఇంట్లో పనికి కుదిర్చాడు సత్యనారాయణ. సత్యనారాయణ కుమార్తె ఉండేది హైదరాబాద్‌లో. దీంతో గత శనివారం రాత్రి బస్సులో వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరింది శ్రీదేవి. ఆదివారంలో సత్యనారాయణ కుమార్తె ఇంట్లో పనిలో చేరి.. ఇంట్లో వారందరితో కలుపుగోలుగా ఉంటూ పనులు చేసింది.
CM Chandrababu : నియోజకవర్గానికో విజన్ ప్లాన్
ఆమె పనితనం చూసి అంతా నమ్మారు కూడా. ఇదే అదునుగా భావించిన నిందితురాలు.. యజమానురాలు మరో గదిలో ఉండగా రాత్రి సమయంలో దాదాపు 16 గ్రాముల బంగారం, పావుకిలో వెండితో ఉడాయించింది. ఆ తర్వాత ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని బాధితులు గుర్తించి వెంటనే బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ విషయాన్ని వైజాగ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహిళ కోసం గాలిస్తున్న సమయంలో వైజాగ్‌లో రిపేర్‌కు ఇచ్చిన మొబైల్ తీసుకోవడానికి వచ్చిన నిందితురాలు అక్కడి పోలీసులకు పట్టుబడింది. ఈ విషయాన్ని బోరబండ పోలీసులకు తెలిపారు వైజాగ్ పోలీసులు. దీంతో శ్రీదేవిని కోసం వైజాగ్ బయలుదేరి వెళ్లారు బోరబండ పోలీసులు. శ్రీదేవిని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన అనంతరం ఆమెను విచారించి దొంగలించిన సొమ్మును రికవరీ చేయనున్నారు పోలీసులు. అయితే పనిమనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Arrest: యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న మహిళ అరెస్టు..
YSRCP: పెనుగంచిప్రోలు తిరుణాలలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 18 , 2025 | 10:23 AM