Inscription: వెలుగులోకి 500 ఏళ్ల నాటి తెలుగు శాసనం.. దేని గురించంటే

ABN, Publish Date - Mar 31 , 2025 | 08:14 AM

వందల ఏళ్ల క్రితం తెలుగులో చెక్కిన రాతి శాసనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పటి తెలుగు భాష ఎంత అద్భుతంగా, అందంగా ఉందో ఆ శాసనం చూస్తే అర్థం అవుతుంది. ఇంతకు అది ఎక్కడ లభ్యం అయ్యింది అంటే..

Inscription: వెలుగులోకి 500 ఏళ్ల నాటి తెలుగు శాసనం.. దేని గురించంటే
Inscription

రాజన్న సిరిసిల్ల: తెలుగుకు ప్రాచీన భాష హోదా ఉంది. అంటే కొన్ని వందల ఏళ్ల పూర్వం నుంచే తెలుగు భాష వాడుకలో ఉందని అర్థం. అందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలు బోలేడు. వందల ఏళ్లకు పూర్వమే అనేక మంది రాజులు తెలుగులో శాసనలు చెక్కించారు. కవులు అచ్చ తెలుగు రచనలు చేశారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో మరో అద్భుతం వెలుగు చూసింది. సుమారు 500 ఏళ్ల నాటి అచ్చ తెలుగు శాసనం ఒకటి వెలుగులోకి వచ్చింది. రాయి మీద చెక్కిన ఈ శాసనంలో దేని గురించి ఉంది.. అప్పుడు తెలుగు భాష ఎలా ఉంది.. ఇంతకు ఈ శాసనం ఎక్కడ బయటపడింది అనే వివరాలు మీకోసం..


సుమారు 500 ఏళ్ల నాటిది అనగా 1517 సంవత్సరానికి చెందిన తెలుగు శాసనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా, అనంతగిరి, నరసింహుల గుట్ట మీద ఈ శాసనాన్ని గుర్తించారు. దీనిలో అనేక మంది స్థానిక హిందూ దేవతాముర్తులను స్తుతించడమే కాక.. అనంతగిరిలోని ఓ కొండ మీద నిర్మించిన విష్ణు ఆలయం గురించి కూడా దీనిలో సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఏఎస్ఐ అధికారులు లంకమల రిజర్వ్ ఫారెస్ట్‌లో.. 800-2000 సంవత్సరాల నాటి శాసనాలను గుర్తించారు. వీటితో పాటుగా ఏఎస్ఐ అధికారులు బృహత్ శిలాయుగం నాటి రాతి కళను కూడా గుర్తించారు. ఈమధ్య కాలంలో గుర్తించిన అతిపెద్ద పురావస్తు పరిశోధనగా చెబుతున్నారు.


ఈ సర్వేలో మూడు రాతి ఆశ్రయాలను గుర్తించారు. వీటిల్లో ఒక దాని మీద జంతువుుల, మరో దాని మీద రేఖాగణిత నమూనాలు, చివరి దాని మీద మానవుల బొమ్మలను వర్ణించే అద్భుతమైన చిత్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ చిత్రాలన్ని బృహత్ శిలాయుగం, చరిత్ర ప్రారంభ దశకాలం నాటికి చెందినవని అధికారులు తెలిపారు. ఆ కాలంలో వారు సహజసిద్ధంగా లభించే పదార్థాలు అనగా జంతువుల కొవ్వు, ఎముకల చూర్ణం వంటి వాటిని ఉపయోగించి ఈ బొమ్మలను గీశారని అధికారలు చెబుతున్నారు.


తెలంగాణలో కూడా పూర్వ చరిత్రకు సంబంధించి లెక్కకు మించి శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ఇక గతేడాది ఏఎస్ఐ టీమ్.. వికారాబాద్‌లోని కంకల్ గ్రామలో చాళుక్యుల కాలం నాటి మూడు శాసనాలను గుర్తించింది. రాష్ట్రంలో తెలుగులో దొరికిన తొలి శిలా శానం.. కీసర గుట్ట శాసనం.. ఇది 420 సీఈ కాలం నాటిది. అలానే కరీంనగర్‌లోని బొమ్మలగుట్ట శాసనం, వరంగల్‌లోని 9వ శతబ్ధానికి చెందిన శాసనాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

ఉపవాస దీక్ష తరవాత

విదేశాల్లో ఉండగా పాస్‌పోర్టు పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే..

Updated Date - Mar 31 , 2025 | 08:42 AM