బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:29 AM
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఉన్నతాధికారులతో తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇల్లందకుంట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఉన్నతాధికారులతో తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలు, సదుపాయాలు సమకూర్చాలన్నారు. భక్తులకు కనపడే విధంగా ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సౌకర్యం, శానిటేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్కారింగ్ ఏర్పాల్లు చూడాలని సూచించారు. హుజూరాబాద్, జమ్మికుంట నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జమ్మికుంట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. మంత్రులు ఎవరు వచ్చిన తాను వారితో కలిసి పాల్గొంటానని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో శ్రీరామనవమి కోసం కలెక్టర్ అకౌంట్ నుంచి 10 లక్షలు కేటాయించేవారని, ఈసారి అలాగే నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌జీ, హుజూరాబాద్ ఆర్డీవో రమేష్‌బాబు, ఆలయ ఈవో కందుల సుధాకర్, తహసీల్దార్ రాణి, ఎంపీడీవో పుల్లయ్య పాల్గొన్నారు.