Share News

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:46 AM

శరవేగంగా విస్తరి స్తున్న వేములవాడ పట్టణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపడుతామని స్థానిక శాసనస భ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

వేములవాడ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : శరవేగంగా విస్తరి స్తున్న వేములవాడ పట్టణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపడుతామని స్థానిక శాసనస భ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్‌ రహ దారిలో కూరగాయల వ్యాపారుల కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు 80 లక్షల రూపాయలతో షెడ్ల నిర్మాణం, రూ.56 లక్షల సీసీ రోడ్డు, డ్రైనేజ్‌ నిర్మాణ పనులకు కలెక్టర్‌ సందీప్‌ కుమా ర్‌ ఝాతో కలిసి సోమవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్‌ రోడ్డులో కూరగాయల మార్కెట్లో రూ. 80 లక్షలతో 68 కూరగాయల స్టాల్స్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ సం దీప్‌ కుమార్‌ ఝా చొరవతో ప్రజలు, కూరగా యల వ్యాపారుల కోరిక మేరకు నూతన నిర్మా ణాలు చేపడుతున్నామని వివరించారు. వేముల వాడలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దే విధంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజల అవసరాలకు అనుగు ణంగా దుకాణాల సముదాయాలు, మార్కెట్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. 11, 12వ వార్డులలో రూ.56లక్షలతో సీసీ రోడ్లు సైడ్‌ డ్రైన్‌ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. వేములవాడ పట్టణంలో ఉన్న 28 వార్డుల్లో కనీస అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి వార్డులో రూ. 10 లక్షలతో పనులను చేపడతా మని పేర్కొన్నారు.

భూసేకరణకు రూ. 6 కోట్లు

వేములవాడ పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణకు రూ.6కోట్ల నిధులు కేటాయించామని ఆది శ్రీనివాస్‌ వెల్లడించారు. రూ.47 కోట్లతో చేప ట్టనున్న రోడ్ల విస్తరణ ప్రక్రియలో భాగంగా ఆరు కోట్ల నిధులను భూ సేకరణ కోసం కేటాయించమన్నా రు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం విస్తరణ పనుల కోసం 76 కోట్ల రూపాయలతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, సెస్‌ డైరెక్టర్‌ నామాల ఉమ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాగరం వెంకటస్వా మి, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 12:46 AM