Share News

ఫోన్‌ చేస్తే సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:32 AM

నియోజకవర్గంలోని ప్రజలు ఫోన్‌ చేస్తే చాలు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం తెలిపారు.

ఫోన్‌ చేస్తే సమస్యల పరిష్కారానికి కృషి
కొడిమ్యాలలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సత్యం

-చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం

కొడిమ్యాల, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని ప్రజలు ఫోన్‌ చేస్తే చాలు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం తెలిపారు. గురువారం మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఏడాదిలో చేశామన్నారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ముందకు సాగుతామన్నారు. 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్‌లను ఎమ్మెల్యే అందించారు. మండలంలోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన గుండ బాబు ఆవును గత జనవరిలో పెద్దపులి దాడి చేసి చంపగా ప్రభుత్వం నుంచి వచ్చిన 35 వేల రూపాయల చెక్‌ను ఎమ్మెల్యే బాధితునికి అందించారు. కార్యక్రమంలో డీఎస్‌వో జితేందర్‌రెడ్డ్డి, డీఎం సీవిల్‌ సప్లయిస్‌ జితేందర్‌, రేంజర్‌ మొయినొద్దీన్‌, తహసీల్దార్‌ రమేష్‌, ఎంపీడీవో స్వరూప, డిప్యూటీ రేంజర్‌ ముషీర్‌ ఆహ్మద్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నారాయణగౌడ్‌, మల్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ జీవన్‌రెడ్డ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ రాజనర్సింగరావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మహిపాల్‌రెడ్డ్డి, ముత్యం శంకర్‌గౌడ్‌, మల్లికార్జున్‌రెడ్డ్డి, ప్రభాకర్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డ్డి, రాజేందర్‌, అజయ్‌గౌడ్‌, స్వామి, మల్లేశం, రవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:32 AM