Share News

రాష్ట్రంలో గాడి తప్పిన పాలన

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:02 AM

కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి పాయల్‌ శంకర్‌ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమ యంలో ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయ డంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

రాష్ట్రంలో గాడి తప్పిన పాలన

పెద్దపల్లి టౌన్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి పాయల్‌ శంకర్‌ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమ యంలో ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయ డంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రజలను మభ్యపెట్టేలా పాలన చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు డీఏ చెల్లింపు, పీఆర్సీ అమలు హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగుల భవిష్య నిధి చెల్లింపులో జాప్యం చేయడం కాంగ్రెస్‌ అసమర్ధ పాలనకు నిదర్శన మన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతోం దని, ఉద్యోగాల నియామకాలు సరిగా జరగడం లేదని మండిప డ్డారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టభద్రులు, ఉపాధ్యాయు లకు న్యాయం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఏకతాటిపై నిలిచి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపుని చ్చారు. అల్జాపూర్‌ శ్రీనివాస్‌, సురభి నవీన్‌రావు, ఆరుముల్ల పోచం, కందుల సంధ్యరాణి, ఆంజనేయులు, పర్వతాలు, సదానందం, రాకేశ్‌, ఫహీమ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:02 AM