Share News

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:50 AM

ప్రజావాణిలో విన్నపాలను, ప్రజల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు.

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో విన్నపాలను, ప్రజల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ప్రజావాణిలో సమ స్యలను చెప్పుకునేందుకు జిల్లా నలుమూల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు తరలిరావ డంతో కిటకిటలాడిపోయింది. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌, డీఅర్‌డీవో శేషాద్రిలు పాల్గొని సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణిలో 155 దరఖాస్తులు, ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 51, సిరిసిల్ల ఆర్డీవోకు 36, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌కు 4, గృహ నిర్మాణ శాఖకు 14, ఉపాధికల్పన శాఖకు 8, అబ్కారీ శాఖకు 1, పంచాయితీరాజ్‌ శాఖకు 15, విద్యాశాఖకు 12, చేనేత జౌళి శాఖకు 1, ఎస్‌డీసీకీ 1, జిల్లా వైధ్యాదికారికి 2 చొప్పున వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాలు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి త్వరగా పరిష్కారం చూపాలన్నారు. అలాగే అర్జీదారులకు లిఖిత పూర్వకంగా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:50 AM