Share News

సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:34 AM

సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని, ఆయన పోరాటాలు భవితరాలకు స్పూర్తిదాయకమని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ వర్ధంతిని నిర్వహించారు.

సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని, ఆయన పోరాటాలు భవితరాలకు స్పూర్తిదాయకమని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హాజరై సర్వాయి పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సామాజిక సమానత్వానికి పాటుపడిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌దేశాయ్‌, బీసీ సంక్షేమ అధికారి అనిల్‌ ప్రకాశ్‌, గౌడ సంఘం, బీసీ సంఘాల ప్రతినిధులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, గుగ్గిళ్ల శ్రీనివాస్‌, మాచెర్ల అంజయ్య, జక్కె వీరస్వామి పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:34 AM