Water Leakage.. కరీంనగర్ జిల్లా: నీట మునిగిన ఎస్సీ కాలనీ..
ABN, Publish Date - Jan 12 , 2025 | 11:36 AM
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం, మన్నెంపల్లిలో డి4 కెనాల్‌కు గండిపడింది. దీంతో సమీపంలోని ఎస్సీ కాలనీలోకి భారీగా నీరు చేరింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వంట సామాగ్రి, ఇతర వస్తువులు నీట మునిగాయి. పండగిపూట సామాగ్రి తడిసిపోవడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం (Thimmapur Mandal), మన్నెంపల్లి (Mannempally)లో డి4 కెనాల్ (D4 Canal)కు గండిపడింది. దీంతో సమీపంలోని ఎస్సీ కాలనీ (SC Colony)లోకి భారీగా నీరు చేరింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వంట సామాగ్రి, ఇతర వస్తువులు నీట మునిగాయి. పండగిపూట సామాగ్రి తడిసిపోవడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటపల్లి రిజర్వాయర్ లింక్ కెనాల్ ద్వారా చిరుగు మామిడి, తిమ్మాపూర్ మండలాల్లోని ఎగువ ప్రాంతాలకు ఈ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తారు. అయితే డి4 కాలువకు గండి పడడంతో మన్నెంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ మొత్తం నీట మునిగింది. పండగపూట సామాగ్రి అంతా నీట నానిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు ఆ కాలువ గండిని పూడ్చే ప్రయత్నాలు మొదలుపెట్టలేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నీటిని విడుదల చేసినప్పుడు కాలువలకు గండ్లు ఉన్నాయా.. లేదా అనేది అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలువకు గండిపడి పంట పొలాలతోపాటు.. ఇళ్లల్లోకి నీరు చేరిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి కెనాల్‌కు గండిపడే అంశంపై ఆరా తీశారు. వెంటనే అధికారులకు చెప్పి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి
శ్రీరామవతార అలంకారంలో నరసింహుడి దర్శనం
కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద బారులు తీరుతున్న వాహనాలు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్నారా.. జాగ్రత్త..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 12 , 2025 | 11:36 AM