Share News

మహనీయుల ఆశయాలు యువతకు ఆదర్శం

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:38 AM

భవిష్యత్‌ తరాలకోసం నిస్వార్ధంగా సంఘ సేవలు అందించిన మహనీయులు జ్యోతిబాఫూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు నేటి యువతీ, యువకులకు ఆదర్శమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.

మహనీయుల ఆశయాలు యువతకు ఆదర్శం
ఓదెల మండలం కొలనూర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయరమణారావు

- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

ఓదెల, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌ తరాలకోసం నిస్వార్ధంగా సంఘ సేవలు అందించిన మహనీయులు జ్యోతిబాఫూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు నేటి యువతీ, యువకులకు ఆదర్శమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మండలంలోని కొలనూర్‌లో అంబేద్కర్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, జ్యోతిబాఫూలే, బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహం తోపాటు మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన అంబేద్కర్‌, జ్యోతిబాఫూలే, జగ్జీవన్‌రామ్‌ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ళ సుమన్‌రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్‌ మాటూరి రత్నం, కో కన్వీనర్‌ పల్లె కనకయ్య, ప్రొఫెసర్‌ మోదంపల్లి సంపత్‌, సాతూరి అనిల్‌, దొడ్డే శంకర్‌, బైరి రవి గౌడ్‌, మాటూరి వెంకటస్వామి, ఢిల్లీ శంకర్‌, మద్దెల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

నాటి స్నేహాలు కల్మషం లేనివి

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): బాల్యంలో గడిపిన రోజులు మరుపురానివని, ఆప్పటి స్నేహాలు సంబందాలు కల్మషం లేనివని పెద్దపల్లి ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1980-81 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సుల్తానాబాద్‌ మండలంలోని నర్సయ్యపల్లిలోని విజయ గార్డన్‌లో నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమ ణారావు మాట్లాడుతు ఈ సమాజంలో స్నేహానికి ఉన్న ప్రాముఖ్యత మరేదానికి లేదని అందరూ సుఖ సంతో షాలతో గడపాలని సూచించారు. ఎమ్మెల్యే విజయరమ ణారావును నాటి గురువులు సాంబయ్య, రాంచంద్రారెడ్డి, రఘును పూర్వవిద్యార్థులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో నగునూరి అశోక్‌కుమార్‌, కొల్లూరు అశోక్‌, కొలిపాక రవీందర్‌, బూడిద స్వామి, శ్రీనివాసరావు, భూలక్ష్మీ, విజయలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:38 AM