కార్మికులకు మెరుగైన వేతనాలు అందించాలి
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:33 AM
మరమగ్గాలతోపాటు అనుబంధ రంగాల కార్మికులకు వేతనాలను నిర్ణయించి సమస్యలను పరిష్కరించాలని సీఐ టీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణలు డిమాండ్ చేశారు.

సిరిసిల్ల రూరల్, ఏఫ్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : మరమగ్గాలతోపాటు అనుబంధ రంగాల కార్మికులకు వేతనాలను నిర్ణయించి సమస్యలను పరిష్కరించాలని సీఐ టీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణలు డిమాండ్ చేశారు. సిరిసిల్లలో మరమగ్గాలతోపాటు అనుబంధ రంగాల కార్మికులు సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ ఆఽధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం ఐదో రోజుకు చేరుకుంది. ఇందు లో భాగంగా పట్టణంలో బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనం నుంచి గోపాల్‌నగర్ చౌరస్తా వరకు కార్మికులు ర్యాలీగా తరలివచ్చి ప్లకార్డులతో నిరసన లు తెలిపారు. సమ్మె డిమాండ్‌ల పరిష్కారం కోసం సోమవారం సిరిసిల్లలో 24 గంటల నిరాహారదీక్ష చేపడుతామని, ఈ కార్యక్రమానికి సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ హాజరవుతారని, మరమగ్గాలతోపాటు అనుబంధ రంగాలైన వార్పిన్, వైపని కార్మికులు పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు నక్క దేవదాస్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కుమ్మరికుంట కిషన్, నాయకులు ఉడుత రవి, ఒగ్గు గణేష్, ఎలిగేటి శ్రీనివాస్, సబ్బని చంద్ర కాంత్, భాస శ్రీధర్, వేణు, తిరుపతి, రాజు, రాము, వెంక టేశ్వర్లు, సదానందం తదితరులు పాల్గొన్నారు.