KCR: అసెంబ్లీకి హాజరైన కేసీఆర్‌

ABN, Publish Date - Mar 13 , 2025 | 04:31 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ 45 నిమిషాల ముందే అసెంబ్లీకి వచ్చారు. ఉదయం 10.15 గంటలకు అసెంబ్లీ మెయిన్‌ గేటు వద్దకు చేరుకోగా, పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

KCR: అసెంబ్లీకి హాజరైన కేసీఆర్‌
  • 45 నిమిషాల ముందే చేరుకున్న ప్రతిపక్ష నేత

  • కేసీఆర్‌తో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ 45 నిమిషాల ముందే అసెంబ్లీకి వచ్చారు. ఉదయం 10.15 గంటలకు అసెంబ్లీ మెయిన్‌ గేటు వద్దకు చేరుకోగా, పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. బీఆర్‌ఎ్‌సఎల్పీ చాంబర్‌లో కేసీఆర్‌ను కలుసుకున్నారు. తన సోదరుడి కుటుంబంలో జరిగే పెళ్లికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందజేశారు. అయితే ఇప్పటికే నియోజకవర్గంలో మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - Mar 13 , 2025 | 04:31 AM