KCR: ప్రజల చూపు బీఆర్‌ఎస్‌ వైపు

ABN, Publish Date - Apr 04 , 2025 | 04:29 AM

తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు చూస్తున్నారని, ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

KCR: ప్రజల చూపు బీఆర్‌ఎస్‌ వైపు
  • ఏ ఎన్నికలు వచ్చినా మాకే పట్టం: కేసీఆర్‌

  • పార్టీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌ్‌సలో భేటీ

గజ్వేల్‌/మర్కుక్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు చూస్తున్నారని, ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆయన సమావేశయమ్యారు. అంతా సమన్వయంతో పనిచేయాలని, ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని సూచించారు.


ఈ సందర్బంగా అదిలాబాద్‌ భాధ్యతలను మాజీ మంత్రి జోగు రామన్నకు, కరీంనగర్‌ భాధ్యతలను కేటీఆర్‌తో పాటు గంగుల కమలాకర్‌లకు అప్పగించారు. కరీంనగర్‌ జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేయాలని సూచించారు. 10 లక్షల మందితో నిర్వహించే ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:29 AM